Saturday, October 4, 2025
ePaper
Homeజాతీయం2027లో జన, కులగణన

2027లో జన, కులగణన

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

జన గణన, కుల గణన 2027లో జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది 2 దశల్లో జరగనుంది. మొదటి దశలో హిమాలయ ప్రాంతాలైన జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో వచ్చే ఏడాది అక్టోబర్‌ నుంచి హౌజ్ లిస్టింగ్ చేపట్టనున్నారు. రెండో దశలో 2027 మార్చి నుంచి మిగిలిన ప్రాంతాల్లో జన, కులగణన ప్రారంభిస్తారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ 2025 జూన్ 4న ప్రకటన చేసింది. సంబంధిత నోటిఫికేషన్‌ను ఈ నెల 16న విడుదల చేస్తామని తెలిపింది.

జన గణన చట్టం 1948లోని సెక్షన్‌ 3 ప్రకారం జన, కులగణన చేస్తామని వివరించింది. మన దేశంలో జనగణనను పదేళ్లకోసారి నిర్వహిస్తారు. చివరిసారిగా 2011లో చేపట్టారు. నిజానికి 2021లో జన గణనను నిర్వహించాలి. కానీ.. కొవిడ్‌ వల్ల వాయిదా పడింది. దీంతో.. 16 ఏళ్ల విరామం అనంతరం నిర్వహించబోతున్నారు. కులగణనను మాత్రం తొలిసారిగా చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గత నెలలోనే తెలిపింది. జనాభా లెక్కల కోసం ఇప్పటికే 30కి పైగా ప్రశ్నలను రెడీ చేసినట్లు సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -

Latest News