Wednesday, February 11, 2026
Homeమెదక్‌ఐకమత్యం – దాతృత్వం ప్రకాశించిన వేళ

ఐకమత్యం – దాతృత్వం ప్రకాశించిన వేళ

  • నిరుపేద విద్యార్థికి సైకిల్ అందజేత

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం దౌలాపూర్ గ్రామస్తులు ఓ నిరుపేద విద్యార్థికి సైకిల్ అందజేశారు. గ్రామానికి చెందిన చాకలి చందు అనే 8వ తరగతి
విద్యార్థి ప్రతిరోజూ 4 కి.మీ (ఉన్నత పాఠశాల, కుర్తివాడ) పాఠశాలకు నడుచుకుంటూ వెళ్లడం ఇబ్బంది పడుతూ, తోటి విద్యార్థుల వలె తానూ సైకిల్ కొనాలనుకున్నా కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతే ఉండడంతో కలత చెందిన విద్యార్థిని గమనించిన గ్రామస్థులు, ఐకమత్యంతో ముందుకొచ్చి డబ్బు సమీకరించారు. ఆ డబ్బుతో సైకిల్ కొనుగోలు చేసి దీపావళి రోజు ఆ విద్యార్థికి అందజేసి ఆ ఇంట్లో దీపావళి వెలుగులు నింపారు.

ఒకే గంటలో డబ్బులు జమ

- Advertisement -

విద్యార్థికి సహాయం కోసం సుమారు 30 మంది ఒకే గంటలో దాదాపు ₹.6000/- జమచేసి ఆ వెంటనే సైకిల్ తీసుకువచ్చి విద్యార్థికి అందజేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సహాయం అందరికీ ఆదర్శంగా నిలిచిందనే చెప్పవచ్చు.

ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ “ఐకమత్యంతో ఉంటే కొండంత సమస్య కూడా సులభంగా పరిష్కారం” అవుతుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News