Tuesday, March 3, 2026
Homeవరంగల్‌Medaram | 19న ఆధునికీక‌ర‌ణ ప‌నుల ప్రారంభం

Medaram | 19న ఆధునికీక‌ర‌ణ ప‌నుల ప్రారంభం

సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా..
రెండో రాజధాని లాంటి వరంగల్‌ని
హైదరాబాద్‌కి దీటుగా అభివృద్ధి చేస్తాం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఉమ్మ‌డి వరంగల్ జిల్లా(United Warangal District)లోని 12 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో చేప‌డుతున్న ప్ర‌గ‌తి ప‌నులు(Progress work), మేడారం జాత‌ర (Medaram Jatara) ఏర్పాట్ల‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ధనసరి అనసూయ(సీత‌క్క‌) Danasari Seethakka, సీఎం స‌ల‌హాదారు వేం న‌రేందర్ రెడ్డి Vem Narender Reddy, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల అధికారులతో క‌లిసి స‌మీక్షించడం జరిగింది.

- Advertisement -


✅వ‌రంగ‌ల్ ప‌ట్టణాభివృద్దికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రూ.4 వేల కోట్లు మంజూరు చేశారు. రెండో రాజ‌ధాని లాంటి వరంగల్‌ను అభివృద్ధిలో హైద‌రాబాద్‌కు ధీటుగా మార్చేందుకు కావాల్సిన సకల సదుపాయాలు, మౌలిక వసతులను కల్పించడానికి ప్రణాళికలు వేస్తున్నాం.
✅ద‌శ‌ల వారీగా చేప‌ట్టే కార్య‌క్ర‌మాల్లో భాగంగా కోర్ అర్బ‌న్ ప్రాంతాల్లోని వ‌ర‌ద తాకిడికి గురైన ప్ర‌జ‌ల‌కు తొలుత సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు నిర్ణ‌యించాం. ఇక్క‌డ తొలుత డ్రైనేజీ ప‌నులు చేప‌డ‌తాం. సుమారు రూ.570 కోట్ల వ్య‌యంతో చేప‌ట్టే మౌలిక స‌దుపాయ‌ల‌ కోసం కూడా మ‌రో వారం రోజుల్లో టెండ‌ర్లు పిలుస్తాం.
✅ఇందిర‌మ్మ ఇండ్లు, 2 BHK ఇండ్ల మంజూరుతోపాటు ఈ ప్రాంతంలో మ‌ధ్య త‌ర‌గ‌తి, మ‌రీ అత్య‌ల్ప ఆదాయం గ‌ల వారి కోసం యుద్ధప్రాతిప‌దిక‌న హౌసింగ్ బోర్డు త‌ర‌హాలో ఇండ్లు క‌ట్టించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించాం.
✅వ‌రంగ‌ల్ ఇన్న‌ర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి భూసేక‌ర‌ణ త్వ‌ర‌లో పూర్తిచేసేలా ఆదేశాలిచ్చాం.
✅భ‌ద్ర‌కాళి ఆల‌యం మాడ‌వీధుల ప‌నులు, చెరువుతో పూడిక తీసివేత‌, ఇత‌ర పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులకు వర్షాల కార‌ణంగా అంత‌రాయం క‌లిగింది. ఈ పనుల పూర్తి కోసం ప్ర‌త్యేక ఆదేశాలు ఇస్తున్నాం. వ‌ర‌ద‌ల కార‌ణంగా దెబ్బ‌తింటున్న కాక‌తీయ టెక్స్‌టైల్ పార్క్‌ను పున‌రుద్ద‌రించేందుకు ఆదేశించాం.
✅వ‌రంగ‌ల్‌ను హెల్త్ సిటీగా మార్చాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తోంది. సుమారు రూ.1100 కోట్లతో నిర్మిస్తున్న 24 అంత‌స్తుల ఆసుప‌త్రి నిర్మాణాన్ని త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేసి వ‌చ్చే ఏప్రిల్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాల‌ని నిర్ణ‌యించాం.
✅వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం ఏర్పాటుకు సంబంధించి భూసేక‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేసిన క‌లెక్ట‌ర్‌, ఇత‌ర అధికారుల‌ను అభినందిస్తున్నాను. భూసేకరణలో సహకరించి అభివృద్ధి పనులకు అండగా నిలిచిన రైతులు, ప్రాంత ప్రజలకు ధన్యవాదాలు.
✅వ‌రంగ‌ల్‌లో క్రీడా స్టేడియం, ప్ర‌త్యేకంగా స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు కోసం డీపీఆర్‌ను రూపొందించాల‌ని ఆదేశించాం.
✅కోట్లాది మంది కొంగు బంగారం, మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రాంగణం ఆధునికీకరణ కోసం సుమారు 200 ఏళ్ల వ‌ర‌కు చెక్కుచెద‌రని రీతిలో రాతి కట్ట‌డాల‌తో మేడారం అభివృద్ది ప‌నులు చేప‌ట్టాం.
✅ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మేడారం ఆధునీక‌ర‌ణ ప‌నులను ఘనంగా ప్రారంభం.. లక్షలాదిగా తరలివచ్చే మహాజాతరకు భారీ ఏర్పాట్లు చేశాం.

- Advertisement -
RELATED ARTICLES

Latest News