ప్రజల చెమట చుక్కను పన్నుగా పిండి.. ప్రజల రక్తాన్ని రాజకీయ పందాలకు ఎరగా వేసే నాయకులకు.. కుర్చీలు శాశ్వతం కాదని కనువిప్పు కలిగే రోజు వస్తుంది.. ఓటు వేసిన వాడు బానిస కాదు.. మీకు అధికారం ఇచ్చిన యజమాని అని గ్రహించండి.. ప్రజాస్వామ్యం అంటే పాలకుల విలాసాల కోసం సామాన్యుడి బలిదానం కాదు.. దోపిడీకి పాల్పడే ప్రతి నాయకుడికి చట్టం సంకెళ్లు వేయాలి.. అప్పుడే సామాన్యుడి ప్రాణానికి.. ఆత్మగౌరవానికి విలువ దక్కుతుంది.. సేవ చేయాల్సిన వారు శాసించే స్థాయికి వెళ్లినప్పుడు వ్యవస్థ కుప్పకూలుతుంది. తప్పు చేసిన నాయకుడిని శిక్షించడం కేవలం చట్టం బాధ్యత మాత్రమే కాదు రేపటి తరం కోసం మనం అడగాల్సిన కనీస హక్కు
- బోయినపల్లి రమణా రావు..
- Advertisement -
