Wednesday, March 18, 2026
Homeవరంగల్‌Gold Recovery | బంగారాన్ని గుర్తించి వృద్ధురాలికి అప్పగించిన పోలీసులు..

Gold Recovery | బంగారాన్ని గుర్తించి వృద్ధురాలికి అప్పగించిన పోలీసులు..

  • సీఐ శ్రీనివాస్ ఎస్ఐ రాజేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు..

చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రామానికి చెందిన చీకటి కమలమ్మ అనే వృద్ధురాలు నిద్రిస్తూ మంగళవారంతెల్లవారి లేచి చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో అనుమానం వచ్చిన వృద్ధురాలు తన ఇంట్లోని బీరువాలో దాచుకున్న బంగారు వెతికింది. కనిపించకపోవడంతో వృద్ధురాలి కుమారుడు రమేష్ కు తెలుపగా రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులు నెక్కొండ సిఐ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి కమలమ్మ ఇంట్లో తనిఖీచేస్తున్న సమయంలో బీరువాలోనే చీరల్లో బంగారు గొలుసులు గుర్తించి బాధితులకు అప్పగించారు. ఎండాకాలం సమీపిస్తున్న కారణంగా ఆరు బయట నిద్రించేవాళ్లు ఇంట్లోని వస్తువులను జాగ్రత్తపరిచి తాళాలు వేసి నిద్రించాలన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని దొంగతనాలను ఇతర నేరాలను నివారించడంలో పోలీసులకు సహకరించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News