Sunday, October 26, 2025
ePaper
Homeక్రైమ్ వార్తలుBrothel | వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

Brothel | వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

వివరాలు వెల్లడించిన టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎక్బాల్‌సిద్దీకి వెల్లడి!!

హైదరాబాద్‌: వ్యభిచార గృహాంపై పోలీసులు దాడిచేసి ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి నగదు రూ.5950, కండోమ్స్ (Condoms) 12, సెల్‌ఫోన్లు 13 స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌ కమిషనరేట్‌ సౌత్‌ వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్సు పరిధిలో గురువారం చోటుచేసుకుంది. సౌత్‌ వెస్ట్‌జోన్‌ అదనపు డీసీపీ ఏం.ఇక్బాల్‌సిద్దీకి, ఇన్స్‌స్పెక్టర్‌ యాదేందర్‌ కథనం ప్రకారం.. మహ్మద్‌ షరీఫ్‌(36) నగరంలోని బంజారాహిల్స్‌ (Banjarahills) రోడ్‌ నంబర్‌ 12లోని ఆర్‌.ఇన్‌(R.in) హోటల్‌‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నాడని టాస్క్‌ఫోర్సు పోలీసులకు పక్కా సమాచారం అందింది. వెంటనే ఒక బృందంగా ఏర్పడిన పోలీసులు హోటల్‌పై ఆకస్మికంగా దాడి చేసి విటులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించి దర్యాప్తు చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) కర్నూల్‌కు చెందిన వ్యక్తి. ఉజ్బెకిస్తాన్‌‌(Uzbekistan)కి చెందిన బాధిత మహిళలు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మహ్మద్‌ షరీఫ్‌ అనే వ్యక్తి వ్యభిచారం నిర్వహిస్తున్నాడని తేలింది. దీంతో ఇతణ్ని అదుపులోకి తీసుకుని విచారించగా పాత నిందితుడని గుర్తించారు. గతంలో స్టాయిల్‌ మెకర్‌ సెలూన్‌ పేరిట వ్యాపారం చేసేవాడని తెలుసుకున్నార. నిరుద్యోగ యువతులను (Unemployed young women) ఉపాధి పేరిట నమ్మించి వ్యభిచార వృత్తిలో దించేవాడని పోలీసులు చెప్పారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం బంజారాహిల్స్‌ ఠాణా పోలీసులకు అప్పగించడంతోవారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News