Saturday, October 4, 2025
ePaper
Homeస్పోర్ట్స్కోహ్లీ పబ్‌పై కేసు నమోదు

కోహ్లీ పబ్‌పై కేసు నమోదు

‘ఒన్ 8 కమ్యూన్’ పేరుతో బెంగళూరులో ఉన్న విరాట్ కోహ్లీ పబ్, రెస్టారెంట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మే నెల 29న జరిగిన సోదాలు జరిపి 31న కేసు బుక్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ పబ్, రెస్టారెంట్‌లో స్మోకింగ్ జోన్ లేకపోవటంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పబ్, రెస్టారెంట్ బెంగళూరులోని మహాత్మాగాంధీ రోడ్‌లో ఉన్నాయి. దీనిక సహయజమానిగా కోహ్లీ వ్యవహరిస్తున్నారు. అందువల్ల కోహ్లీతోపాటు అక్కడి సిబ్బందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

నిబంధనల ప్రకారం హోటల్స్, రెస్టారెంట్స్, ఎయిర్‌పోర్ట్స్ వంటి ప్రాంతాల్లో స్మోకింగ్ జోన్‌లను ఏర్పాటుచేయటం కంపల్సరీ. అయితే.. ఈ పబ్, రెస్టారెంట్ గతంలోనూ ఇతర నిబంధనలను అతిక్రమించి వార్తల్లో నిలిచింది. గతేడాది జులై 6న అర్ధరాత్రి దాటాక ఒకటిన్నర వరకు తెరిచి ఉంచటంతో పోలీసులు కేసు పెట్టారు. ఫైర్ డిపార్ట‌మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోలేదనే కారణంతో 2024 డిసెంబర్‌లో బెంగళూరు నగర పాలక సంస్థ నోటీసులు జారీ చేసింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News