కొత్తపల్లి: కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన గన్ను రాకేష్ రెడ్డి, పోగుల సంపత్ తమ ట్రాక్టర్ ట్రైలర్లలో మానేరు నది నుంచి, ఒల్లేపు అజయ్ నగునూరు వాగు నుంచి అనుమతి లేకుండా (Illegal) ఇసుక తరలిస్తుండగా కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా రూరల్ ఇన్‌స్పెక్టర్ ఎ.నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి చర్యల కోసం కోర్టుకు పంపించామని చెప్పారు.

ఎవరైనా గతంలో అక్రమ ఇసుక (Sand) రవాణా చేసి, మరొకసారి ఈ నేరానికి పాల్పడితే ట్రాక్టర్లను సీజ్ చేసి కోర్టుకు అప్పగిస్తామని హెచ్చరించారు. నిందితులపై పీడీ యాక్ట్ (PD Act) కూడా నమోదు చేస్తామని తెలిపారు.

