Tuesday, October 28, 2025
ePaper
Homeజాతీయంఅమెరికాకు మోడీ

అమెరికాకు మోడీ

  • ట్రంప్‌తో భేటీకి అవకాశాలు
  • టారిఫ్‌ల టెన్షన్‌ వేళ ఊర‌ట క‌లిగేనా..?

భారత్‌పై అమెరికా అధిక టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో, రెండు దేశాల వాణిజ్య సమస్యల పరిష్కారానికి దోహదం చేసే కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెల అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆయన భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీతో పాటు పలువురు విదేశీ నేతలతో కూడా మోదీ ద్వైపాక్షిక సమావేశాలు జరపనున్నారు.

ఐక్యరాజ్యసమితి వేదికపై మోదీ ప్రసంగం
సెప్టెంబర్ 9న ఐక్యరాజ్యసమితి 80వ జనరల్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. హై లెవల్ డిబేట్ మాత్రం సెప్టెంబర్ 23 నుంచి 29 వరకు జరగనుంది. చర్చలో పాల్గొనబోయే నేతల జాబితాను యూఎన్ తాజాగా ప్రకటించింది. ఆ జాబితాలో భారత ప్రధాని మోదీ పేరు కూడా ఉంది.

తాజా షెడ్యూల్ ప్రకారం, సెప్టెంబర్ 23న యుఎన్‌జీఏ వేదికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ నేతలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సెప్టెంబర్ 26న ప్రధానమంత్రి మోదీ ప్రసంగం ఉండనుంది. అదే రోజున ఇజ్రాయిల్, చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నేతలు కూడా సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడతారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News