Tuesday, March 3, 2026
Homeఆంధ్రప్రదేశ్Chandrababu Naidu | ప్రధాని మోడీ సర్ణయాలు భేష్..!

Chandrababu Naidu | ప్రధాని మోడీ సర్ణయాలు భేష్..!

భరత్ ను ప్రపంచంలో నంబర్ 1 చేయాలని మోడీ కృషి

  • మదిలో నిలిచిపోయే తీర్పులనిచ్చిన జస్టిస్ గవాయ్
  • సమాన ఓటు హక్కు అంబేడ్కర్ ఇచ్చిన వరం
  • ప్రజాస్వామ్యం లో న్యాయవ్యవస్థ కీలకం
  • 2047 నాటికి ఉన్నత స్థాయికి చేరతారని ధీమా
  • న్యాయవాదుల సదస్సులో సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ‘భారత -రాజ్యాంగం 75 సంవత్సరాలు’ అనే అంశం పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం నిర్వహించిన సదస్సులో ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. ప్రసంగంలో ఆయన భారత రాజ్యాంగం అందించే స్ఫూర్తిని అత్యంత గొప్పదని, దీని ద్వారా ప్రతి భారత పౌరుడికి సమాన అవకాశాలు కల్పించబడ్డాయని పేర్కొన్నారు.
“మనకు అద్భుతమైన రాజ్యాంగాన్ని బి.ఆర్. అంబేద్కర్ రూపొందించి ఇచ్చారని, సాధారణ అమ్మే స్థాయి నుండి దేశ ప్రధానమంత్రిగా ఎదగగలిగిన నరేంద్ర మోడీకి కూడా ఇది ఒక గొప్ప వేదికను అందించింది” అని చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ప్రధానమంత్రి మోడీ నిరంతర కృషి ద్వారా దేశాన్ని ప్రపంచంలో శ్రేష్ట స్థానాల్లో నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నారని ప్రశంసించారు చంద్రబాబు నాయుడు. “ప్రధాని మోడీ దేశం కోసం తీసుకుంటున్న నిర్ణయాలు, విధులు, యువతతో చేసే సంభాషణలు, అనేక రంగాల్లో పరిష్కారాలు సూచించడం మన రాజ్యాంగం ద్వారా సాధ్యమవుతుంది” అని ఆయన అన్నారు.

- Advertisement -

ఈ సదస్సుకి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కూడా హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు సీజేఐ జస్టిస్ గవాయ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. “మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతం నుంచి వచ్చిన జస్టిస్ గవాయ్, అత్యున్నత పదవిలో ఉండటం గుర్తుంచుకోకుండా, నిరాడంబరంగా, సమానత్వ భావంతో ప్రతీ నిర్ణయం తీసుకుంటారు.

ప్రజల మదిలో నిలిచిపోయే తీర్పులను ఆయన ఎప్పటికీ ఇచ్చారు” అని కొనియాడారు. చంద్రబాబు నాయుడు భారతదేశ భవిష్యత్తుపై తన ప్రగాఢమయిన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. “ప్రపంచంలోని చాలా దేశాలు యువత కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. కానీ మన దేశంలో అపారమైన మానవ వనరులు ఉన్నాయి. సంస్కరణల తరువాత ప్రజల ఆలోచన విధానంలో వచ్చిన మార్పులు దేశాన్ని వేగంగా అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాయి. 2047 నాటికి భారతీయులు ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన శక్తిగా ఎదుగుతారని నమ్మకం ఉంది” అని ఆయన అన్నారు.

సమాజంలో జరిగే తప్పులను సరిదిద్దడంలో,ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో న్యాయవ్యవస్థ పాత్ర కీలకమని ఆయన కితాబిచ్చారు. ఆధునిక కాలంలో సోషల్ మీడియా ప్రభావం కూడా పెద్ద సవాలుగా మారిందని చంద్రబాబు పేర్కొన్నారు. “సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఎడిటర్గానే మారిపోయారు. వ్యక్తిగత దాడులు, విమర్శలు విస్తరి స్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో దేశ ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి” అని ఆయన పిలుపునిచ్చారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రవేశపెట్టిన ‘ఒక వ్యక్తి -ఒక ఓటు’ హక్కు ఒక గొప్ప వరం అని చంద్రబాబు పేర్కొన్నారు. “ఇతర దేశాల్లో ఇంకా సమాన ఓటు హక్కు అందించబడలేదని గమనిస్తే, మన దేశంలో పేద, ధనిక, ఆడ, మగ అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సమా న హక్కు లభించడం మహా నిఖార్సైన సాధన” అని చెప్పారు. చట్టాలు, ప్రభుత్వ విధానాలు సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని సాధించడంలో కీలకంగా ఉంటాయని, ఆరోగ్యకరమైన, సంపన్నమైన, సంతోషకరమైన సమాజాన్ని నిర్మించడమే తమ ప్రణాళిక అని చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News