Thursday, March 26, 2026
Homeఆంధ్రప్రదేశ్Balloons | ఈ బెలూన్లు కనపడితే సమాచారం ఇవ్వండి

Balloons | ఈ బెలూన్లు కనపడితే సమాచారం ఇవ్వండి

సమాచారం ఇచ్చినవారికి బహుమతులు

టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR), అణు శక్తి శాఖ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO)ల సంయుక్త ఆధ్వర్యంలో 2025 డిసెంబర్ 31 వరకు శాస్త్రీయ బెలూన్ ప్రయోగాలు నిర్వహిస్తున్నామని హైదరాబాద్ టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సైంటిస్ట్ డాక్టర్ టి.వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

ప్రకటనలోని ముఖ్యాంశాలు.. శాస్త్రీయ ప్రయోగాలు పూర్తైన అనంతరం పరికరాలు బెలూన్‌ నుంచి విడిపోయి రంగుల ప్యారాచ్యూట్ల(Parachutes)తో నెమ్మదిగా భూమి(Land) పైకి వస్తాయి. గాలుల దిశను బట్టి ఇవి హైదరాబాద్‌ (Hyderabad) నుంచి 200-350 కి.మీ దూరంలోని ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం(Vishaka), హైదరాబాద్, షోలాపూర్(Sholapur) ప్రాంతాల్లో దీని పరిధి వ్యాపించే అవకాశం ఉంది.

పాలిథిన్ పదార్థంతో తయారైన ఈ బెలూన్ల వ్యాసం 50 నుంచి 85 మీటర్ల వరకు ఉంటుంది. ఇవి ఈసీఐఎల్ ప్రాంతంలోని టీఐఎఫ్ఆర్ బెలూన్ ప్రయోగ కేంద్రం నుంచి రాత్రి 8 గంటలు-ఉదయం 6.30 గంటల మధ్యలో హైడ్రోజన్ వాయువుతో నింపి వదులుతారు. ఇవి 30 కి.మీ నుంచి 42 కి.మీ ఎత్తు వరకు చేరి శాస్త్రీయ పరికరాలతో ప్రయోగాలు నిర్వహిస్తాయి.

ఈ పరికరాలు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, వైఎస్సార్ కడప, విశాఖపట్నం జిల్లాల్లో పడొచ్చు. ఆ ప్యారాచ్యూట్లలో ఉన్న శాస్ట్రీయ పరికరాలు సున్నితమైనవి. అందువల్ల వాటిని తాకడం, పగులగొట్టడం చేయరాదు. వాటిని గుర్తించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్, పోస్టాఫీస్ లేదా జిల్లా అధికారులకు సమాచారం అందించాలి.

సమాచారం అందిన వెంటనే శాస్త్రవేత్తలు పరికరాలను సేకరిస్తారు. పరికరాలను గుర్తించి తగిన సమాచారం అందించినవారికి తగిన బహుమతి, ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. పరికరాన్ని తెరిచినా, పాడు చేసినా బహుమతి ఇవ్వరు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఈ బెలూన్లు లేదా పరికరాలను గుర్తించే అవకాశం ఉన్నందున విస్తృతంగా ప్రచారం కల్పించాలని టీఐఎఫ్ఆర్ సైంటిస్టు డాక్టర్ టి.వెంకటేశ్వరరావు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News