ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్, సిద్దిపేట్ ఎమ్మెల్యే(Siddipet Mla) హరీష్ రావు(Harish Rao) విచారణ(Enquiry) ముగిసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్(Hyderabad Police Commissioner) సజ్జనార్(Sajjanar) ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(Sit) దాదాపు ఏడు గంటల పాటు ఆయన్ని విచారణ చేసింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్(Jubileehills Police Station)కి విచారణకు రావాలంటూ హరీష్ రావుకి సిట్ నిన్న రాత్రి నోటీసులు ఇచ్చింది. దీంతో ఆయన హుటాహుటిన సిద్దిపేట్ నుంచి హైదరాబాద్‌కు చేరుకొని విచారణకు హాజరయ్యారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. హరీష్ రావును కోకాపేటలోని ఆయన నివాసంలో కలిశారు. విచారణకు వచ్చేటప్పుడు మధ్యలో పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్‌కి వెళ్లారు. మీడియాతో మాట్లాడారు. సిట్.. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లో నడుస్తోందని ఆరోపించారు. ఇలాంటి ఎన్ని విచారణలనైనా ఎదుర్కొంటామని చెప్పారు. విచారణ అనంతరం కూడా తెలంగాణభవన్‌కి వచ్చారు.
Phone Tapping Case | ముగిసిన హరీష్ రావు విచారణ
- Advertisement -
RELATED ARTICLES
