కాంగ్రెస్ గెలుపుతో సంబరాలు నిర్వహించిన కాంగ్రెస పార్టీ శ్రేణులు
టపాసులు కాల్చి, మిఠాయిలు పంచిన నాయకులు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(JubileeHills Bye Election)లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి (Congress Party Candidate) నవీన్ యాదవ్ (Naveen Yadav) దాదాపు 25 వేల మెజారిటీతో గెలుపొందడం పట్ల గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ (Chairman of Gaddi Annaram Agricultural Market Committee) చిలుక మధుసూదన్ రెడ్డి (Chiluka Madhusudhan Reddy) హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఆధ్వర్యంలో అనాజ్‌పూర్ గ్రామ పంచాయితీ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించి టపాసులు కాల్చి ప్రజలకు మిఠాయిలు పంచి సంబరాలు (Celebrations) జరుపుకున్నారు.

ఇది రేవంతన్న పాలనకు జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చిన సరైన తీర్పు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో BRS పార్టీకి కాలం చెల్లిందని, BJPని తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతున్నారని, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఇంకో 10 ఏళ్లు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

