Thursday, March 5, 2026
Homeవరంగల్‌Kalyanalakshmi | పేదింటి ఆడబిడ్డలకు వరప్రదాయిని

Kalyanalakshmi | పేదింటి ఆడబిడ్డలకు వరప్రదాయిని

చెక్‌ల పంపిణీలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వెల్లడి

నర్సంపేట, జనవరి 23(ఆదాబ్ హైదరాబాద్): బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే (Narsampet MLA) దొంతి మాధవరెడ్డి(Donthi Madhava Reddy) చెప్పారు. శుక్రవారం నర్సంపేట మునిసిపాలిటీ పరిధిలోని సిటిజెన్ క్లబ్‌లో 7 మండలాలకు చెందిన 305 మంది లబ్ధిదారులకు రూ.3.05 కోట్ల విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్(Shadi Mubarak) చెక్‌లను పంపిణీ(Cheques Distribution) చేశారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేస్తుందని అన్నారు. కల్యాణలక్ష్మి పథకం అర్హులు దళారులను నమ్మొద్దని సూచించారు. పెళ్లి చేసిన ఇంటికి ఆర్ధిక సహాయం అందించాలనేది ప్రభుత్వ నిర్ణయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, వైస్ చైర్మన్ హరిబాబు, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, నర్సంపేట తహశీల్దార్ రవిచంద్రారెడ్డి, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News