Monday, October 27, 2025
ePaper
Homeనల్లగొండPending Bills | పెండింగ్ బిల్లులను తక్షణం విడుదల చేయాలి

Pending Bills | పెండింగ్ బిల్లులను తక్షణం విడుదల చేయాలి

  • ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి డిమాండ్

సూర్యాపేట: రాష్ట్రంలోని ఉద్యోగుల(Employees), ఉపాధ్యాయుల (Teachers) పెండింగ్ బిల్లుల(Pending Bills)ను తక్షణమే విడుదల చేయాలని ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి (MLC Pingili Sripal Reddy) డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేటలోని జే ఫంక్షన్ హాల్‌లో పిఆర్టియు (PRTU) జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల సంక్షేమానికి పిఆర్టియు చేసిన కృషి అపారమని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ప్రతి పిఆర్‌సి (PRC) మెరుగ్గా సాధించడంలో సంఘం పాత్ర విశేషమని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు (Promotions) కల్పించడం పిఆర్టియు కృషి ఫలితమని పేర్కొన్నారు. పండిట్(Pandit), పిఈటీ (PET) అప్‌గ్రేడేషన్ కూడా తాను చేసిన కృషి ఫలితమేనని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న డీఏ, జిపిఎఫ్‌, టిఎస్‌జిఎల్ఐ, సరెండర్ లీవ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ బిల్లుల విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. వీటి కోసం త్వరలో పోరాటం చేపడతామని హెచ్చరించారు. సిపిఎస్ రద్దు కోసం నిర్వహించిన పెన్షన్ విగ్రహ దినం విజయవంతమైందని, ఈ ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తామని తెలిపారు.

సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నిబంధనలను రద్దు చేసేందుకు న్యాయ పోరాటం కొనసాగుతున్నదన్నారు. గురుకులాలకు కామన్ టైం టేబుల్‌ అమలులో తాను ఇచ్చిన హామీ నెరవేరిందని, వారం రోజుల్లో మిగిలిన గురుకులాలకు కూడా అమలు చేస్తామని చెప్పారు. మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులకు బదిలీలు, కేజీబీవీ ఉపాధ్యాయులకు ఎంటీఎస్‌ అవకాశాల కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. 2008 డీఎస్సీ అభ్యర్థుల రెగ్యులరైజేషన్‌పై చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

సమావేశంలో తీగల నరేష్ ప్రవేశపెట్టిన నివేదికను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలు మారం పవిత్ర, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు దండుగుల ఎల్లయ్యలను కూడా సన్మానించారు. కార్యక్రమంలో జితేందర్ రెడ్డి, నరేష్‌, కొల్లు మధుసూదన్ రావు, నర్సింహారెడ్డి, కాలం నారాయణ్ రెడ్డి, పప్పుల వీరబాబు, రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News