వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి, గంగమ్మ తల్లి బోనాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ముదిరాజ్ సంఘం వార్షికోత్సవాల సందర్భంగా పెద్దమ్మ తల్లి, గంగమ్మ తల్లి బోనాలను అమ్మవార్లకు మొక్కులు చెల్లించడం ఆనవాయితీ. దీనిలో భాగంగా 14వ వార్షికోత్సవ సందర్భంగా మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో డప్పు చప్పుళ్ళతో బోనాలతో తరలి వెళ్లి అమ్మవార్లకు నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున తరలిరాగా సంఘ నాయకులు యువతీ యువకులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.




- Advertisement -
