Friday, September 12, 2025
ePaper
spot_img
Homeసినిమా'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్‌లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్‌లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

పవర్ స్టార్మ్ అలర్ట్: హరీష్ శంకర్, దేవి శ్రీ ప్రసాద్, మైత్రి మూవీ మేకర్స్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్‌లో జాయిన్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ సెన్సేషనల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో అఫీషియల్ గా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సెట్స్‌ లో జోష్ నెలకొంది.  

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తో పాటు, సినిమాలోని ప్రముఖ తారాగణం కూడా షూటింగ్‌లో పాల్గొంటోంది.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానరర్ పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.

ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆయనంక బోస్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, ఉజ్వల్ కులకర్ణి  ఎడిటర్. రామ్-లక్ష్మణ్ ద్వయం యాక్షన్ సీక్వెన్స్‌లను కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఆనంద్ సాయి ప్రొడక్షన్ డిజైనర్. స్క్రీన్ ప్లే కె. దశరథ్ రాశారు, అడిషినల్ రైటింగ్ సి చంద్ర మోహన్.

తారాగణం: పవన్ కళ్యాణ్, శ్రీలీల  

సాంకేతిక సిబ్బంది:
రచన-దర్శకత్వం: హరీష్ శంకర్. ఎస్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
స్క్రీన్ ప్లే: కె దశరథ్
రచన సహకారం: సి చంద్ర మోహన్
సినిమాటోగ్రఫీ: ఆయనంక బోస్
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి
ప్రొడక్షన్ డిజైనర్: ఆనంద్ సాయి
CEO: చెర్రీ
ఫైట్స్: రామ్ లక్ష్మణ్
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్వో: వంశీ-శేఖర్

RELATED ARTICLES
- Advertisment -

Latest News