జిల్లా మాజీ జడ్జి, హైకోర్టు న్యాయవాది జి.అనిల్ కిరణ్ కుమార్
కొత్తపేటలోని స్పైసీ హబ్‌లో జరిగిన న్యాయవాదుల ‘గెట్ టుగెదర్’ (Get together) కార్యక్రమానికి జిల్లా మాజీ జడ్జి, హైకోర్టు న్యాయవాది జి.అనిల్ కిరణ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల(Lawyers)కు పలు సూచనలు చేశారు. న్యాయవాద వృత్తి కత్తి మీద సాములాంటిదని అన్నారు. ఇందులో ఓపిక(patience), అణుకువ, సహనం చాలా అవసరమని, క్రమశిక్షణ(Discipline) ముఖ్యమని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్, వికలాంగ సంక్షేమ చైర్మన్ ముత్తినేని వీరయ్య, తెలంగాణ PCC లీగల్ సెల్ (Legal Cell) వైస్ చైర్మన్ కంపల్లి ఉదయ్ కాంత్, సురక్ష సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిక్కర గోపీ శంకర్ యాదవ్, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రస్తుతం న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.
