Friday, February 13, 2026
Homeవరంగల్‌నూతన సర్పంచులు, వార్డు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించాలి

నూతన సర్పంచులు, వార్డు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించాలి

  • ఆదేశించిన ఎంపీడీవో శంకర్ నాయక్.
  • 100% పన్నులు వసూలు చేయాలి.
  • ఎంపీఓ శేషు.

ఎన్నికైన నూతన సర్పంచులు, వార్డు సభ్యులు ఈనెల 22న ప్రమాణ స్వీకారం కార్యక్రమం అన్ని గ్రామాల్లో నిర్వహించాలని ఎంపీడీవో మాలోత్ శంకర్ నాయక్ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. శుక్రవారం పర్వతగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో పర్వతగిరి ఎంపీడీవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయానికి సంబంధించిన పూర్తి లెక్కలను తప్పనిసరిగా తేదీ 24-01-2026 లోగా సంబంధిత అధికారులకు సమర్పించాల్సిందిగా చూసిచూ, గడువు లోపు లెక్కలు సమర్పించని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.

అలాగే ప్రతి గ్రామ పంచాయతీ నర్సరీ లో ఫ్రెష్ రైజింగ్ లో 3000 మొక్కలు పెంచాలని ఆదేశించారు. ఎంపీవో శేషు మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో 100 శాతం పన్ను వసూలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీవో సుశీల్ కుమార్, హోసింగ్ ఏ.ఈ ఉదయశ్రీ, పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News