- సర్పంచ్ నల్ల మోహన్
- సర్పంచ్ ను సన్మానించిన టిడబ్ల్యూజే ఎఫ్ అధ్యక్షులు నల్లగొండ సత్తయ్య గౌడ్
తల్లి తండ్రి దీవెనే నాకు శ్రీరామరక్ష అయిందని బోయిన్ పల్లి సర్పంచ్ నల్లమోహన్ అన్నారు. మంగళవారం నాడు బోయిన్ పల్లి లోని తన నివాసంలో సర్పంచ్ తో పాటు ఆయన తల్లిదండ్రులను టిడబ్ల్యూజేఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సినీయర్ జర్నలిస్ట్ నల్గొండ సత్తయ్య గౌడ్ సన్మానించారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ తన తల్లి తండ్రి ఎన్నికల్లో పోటీ చేయడానికి తోడు నీడగా దీవెనలు అందిస్తూ పని చేశారన్నారు గ్రామ అభివృద్ధి కోసం కృత నిశ్చయంతో పని చేస్తానని తెలిపారు.
అలాగే మండల జర్నలిస్టుల కోసం వారి సమస్యల సాధన కోసం తన వంతు సహకారం అందిస్తానన్నారు ఈ సందర్భంగా జర్నలిస్ట్ ల సంఘం అధ్యక్షులు నలగొండ సత్తయ్య గౌడ్ మాట్లాడుతూ కొందరి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వచ్చాయని మరికొంతమంది జర్నలిస్టుల ఇళ్లస్థలాల కోసం మీ సహకారం అందిస్తూ వారికి ఇండ్ల స్థలాలు అందే విధంగా చూడాలని సర్పంచ్ కు విజ్ఞప్తి చేశారు.
