Tuesday, February 10, 2026
Homeకరీంనగర్Selection | రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక

Selection | రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక

పారమిత పాఠశాల విద్యార్థికి అభినందనలు

కరీంనగర్, డిసెంబర్ 16 (ఆదాబ్ హైదరాబాద్): ఈ నెల 17 నుంచి 25 వరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (Hyderabad Cricket Association) ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్ర స్థాయి (State Level) అండర్-14 (Under-14) క్రికెట్ ఛాంపియన్‌షిప్ (Championship) పోటీలకు స్థానిక పద్మానగర్ పారమిత హెరిటేజ్ పాఠశాల 9వ తరగతి విద్యార్థి పి.కేదార్‌నాథ్ ఎంపికైనట్లు స్కూల్ డైరెక్టర్, ప్రధానోపాధ్యాయుడు హన్మంతరావు తెలిపారు. ఇటీవల కరీంనగర్ జిల్లా అలుగునూర్‌లో జరిగిన అండర్-14 జిల్లా స్థాయి పోటీల్లో కేదార్‌నాథ్ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.

- Advertisement -

ఈ నేపథ్యంలో పాఠశాల చైర్మన్ డాక్టర్ ఇ.ప్రసాదరావు, డైరెక్టర్స్ ప్రసూన, అనూకర్‌రావు, రశ్మిత, రాకేశ్, వి.యు.యం.ప్రసాద్, వినోద్ రావు, కె.హన్మంతరావు, ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపీకృష్ణ, సమన్వయకర్తలు రబీంద్ర పాత్రో, భవానీ, నిఖిత, వ్యాయామ ఉపాధ్యాయుడు జి.మహేష్, యస్.రాజు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News