- పాపన్నపేట పోలీసు అమరులకు ఇరవై ఆరేళ్ళు
- త్యాగాలను స్మరించుకున్న ఎస్సై, సిబ్బంది
పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివని ఎస్సై శ్రీనివాస్ గౌడ్ అన్నారు.మంగళవారం పోలీసులు అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని పోలీస్ స్టేషన్లో అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 26 ఏళ్ల క్రితం 1999 సెప్టెంబర్ 13న పాపన్నపేట పోలీస్ స్టేషన్ ను మావోయిస్టులు పేల్చివేయడం చాలా బాధాకరమన్నారు. ఈ ఘటనలో అమరులైన పోలీసులు హెడ్ కానిస్టేబుల్ రఘునందన్, కానిస్టేబుళ్లు అబేద్ హుస్సేన్, రాంచందర్, ప్రసాద్, నర్సింలు చిత్రపటాలకు నివాళులు అర్పించారు. వీరితో పాటు వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ వివిధ ఘటనల్లో అమరులైన పోలీసులను ఎప్పటికీ మరువబోమన్నారు.పోలీసులు పగలు రాత్రి తేడా లేకుండా శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. శాంతి భద్రతల విషయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు.ఏఎస్సై తుక్కయ్య, కానిస్టేబుళ్లు బస్వరాజ్, శివకుమార్, నర్సింలు, వెంకటేష్, యాదగిరి, నాగలక్ష్మీ, తదితరులున్నారు.
