Tuesday, February 10, 2026
HomeUncategorizedనెహ్రూకి ఘన నివాళులు

నెహ్రూకి ఘన నివాళులు

భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 61వ వర్ధంతి (2025 మే 27 మంగళవారం) సందర్భంగా హైదరాబాద్‌లోని ఆల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ (ఏ-బ్లాక్) నాయకులు ఆ మహానేతకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆ మహనీయుని స్మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. జోహార్ పండిట్ నెహ్రూ.. అమర్ రహే జవహర్ లాల్ నెహ్రూ అని నినదిస్తూ స్మరించుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, నవ భారత నిర్మాణానికి పునాదులు వేసిన దార్శనికుడిగా నెహ్రూ అందించిన సేవలను కొనియాడారు. చిన్నారుల మనసుల్లో చాచాగా నిలిచిపోయిన భారతరత్న జవహర్ లాల్ నెహ్రూ పాలనా దక్షతను కీర్తించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రతినిధి ఆర్.చంద్రశేఖర్, తోట లక్ష్మికాంత్ రెడ్డి, మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ షేక్ అఫ్సర్ బాయి, సీనియర్ లీడర్లు నిమ్మ అశోక్ రెడ్డి, సి.ఎల్.యాదగిరి, శివశంకర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News