భారత విమానాల(Indian Airlines)పై గగనతల నిషేధాన్ని(Airspace Ban) పాకిస్తాన్ మరో నెల పొడిగించింది(Extend). గత పొడిగింపు ఈ నెల 24న ముగియనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ విమానాశ్రయాల అథారిటీ(PAA) బుధవారం.. ఈ ఆంక్షలను 2026 జనవరి 23 వరకు పెంచింది. పహల్గామ్ దాడి (Pahalgam Attack) తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో పాకిస్తాన్ తన గగనతలాన్ని భారత విమానయాన సంస్థలకు మూసివేసింది. ఇండియా కూడా పాకిస్తాన్‌పై ఇలాంటి నిషేధాన్నే అమలుచేస్తోంది. ఏప్రిల్‌లో జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద(Terrorists) దాడిలో 26 మంది భారతీయులు మరణించారు. ఇది మే నెలలో భారత్, పాకిస్తాన్ మధ్య 4 రోజుల ఘర్షణకు దారితీసింది. ఇస్లామాబాద్ తన గగనతలం మీదుగా ఎగురుతున్న భారత విమానాలపై నిషేధాన్ని అనేక సార్లు పొడిగించింది.
Pakistan | మన విమానాలపై మరో నెల నిషేధం
- Advertisement -
RELATED ARTICLES
