Friday, February 27, 2026
Homeఅంతర్జాతీయంPak vs Baloch | చేతులెత్తేసిన పాకిస్తాన్..

Pak vs Baloch | చేతులెత్తేసిన పాకిస్తాన్..

  • బలోచ్ లిబరేషన్ ఆర్మీ రెబల్స్ ను ఎదిరించలేని పరిస్థితి..
  • వాస్తవాబూ అంగీకరించిన పాక్ రక్షణమంత్రి

బలూచిస్థాన్‌లో పాక్ సైన్యంపై బలోచ్ వేర్పాటువాదుల దాడులు పెరిగాయి. అక్కడ తమ సైన్యం చేతులెత్తేసిందని పాక్ రక్షణ మంత్రి ఒప్పుకున్నారు. ఇటీవల రెబల్స్ జరిపిన దాడుల్లో 80 మంది సైనికులు మరణించగా.. అనేక ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. భౌగోళిక సవాళ్లతో పాటు, రెబల్స్ సమన్వయంతో దాడులు చేస్తున్నారని పాక్ మంత్రి తెలిపారు. అమాయకుల ప్రాణాలను తీసే ఉగ్రవాద సమూహం బీఎల్ఏతో చర్చలు ఉండవని, నేర ముఠాలు కూడా ఉన్నాయని ఆరోపించారు. బలూచీస్థాన్‌ వేర్పాటువాదులు చేతుల్లో పాకిస్థాన్ సైన్యానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

బలోచ్ లిబరేషన్ ఆర్మీ రెబల్స్‌కు పాక్ సైన్యం ఎదురు నిలబడి పోరాడలేని పరిస్థితి నెలకుంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసీఫ్ స్వయంగా అంగీకరించడం గమనార్హం. బలూచీస్థాన్‌ ప్రావిన్సుల్లో రెబల్స్‌ను ఎదుర్కొనలేక తమ సైన్యం చేతులెత్తేసిందని ఆయన వ్యాఖ్యానించారు. బలూచ్ ప్రావిన్సులోని అనేక పట్టణాలపై ఏకకాలంలో రెబల్స్ దాడులు చేసి కనీసం 80 మంది భద్రతా సిబ్బందిని చంపి, 30కి పైగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కొన్ని రోజుల తర్వాత ఆయన నుంచి వ్యాఖ్యలు వచ్చాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News