Tuesday, March 3, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంPaidi Yella Reddy | సంకల్పబద్ధ నాయకుడు పైడి యెల్లారెడ్డి

Paidi Yella Reddy | సంకల్పబద్ధ నాయకుడు పైడి యెల్లారెడ్డి

ఆర్ఎస్ఎస్, బీజేపీ అనుబంధ సంస్థల్లో నిర్విరామ కృషి.. బీజేపీ పార్టీపై అచంచలమైన నమ్మకం.. డా. పైడి యెల్లా రెడ్డి జీవిత కథనంలో ఎన్నెన్నో ఆసక్తికర ఘటనలు.. మా పాఠకుల కోసం ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న ప్రత్యేక కథనం..

వసుదైక కుటుంబ భావనతో ఉన్న బీజేపీ నాయకుడు మోడీ మార్గదర్శకత్వంలో, ప్రజలను ప్రస్తుత స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్లే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు
పైడి యెల్లా రెడ్డి.

- Advertisement -
  • ఎస్‌బీఐ, ఎస్‌ఐఐసీ, నాబార్డ్‌ వంటి సంస్థలు..
  • అమరావతి పునర్నిర్మాణం సంతోషదాయకం
  • అమరావతి నిర్మాణం అంటే ఒక యజ్ఞం
  • రైతులకు అండగా కార్యకలాపాలు సాగాలి
  • సమాజసేవలో సర్వస్వం ధారపోయిన వ్యక్తిత్వం..
  • దృఢమైన సంకల్పం ఆయనకు ఆభరణం..
  • వ్యవసాయ కుంటుంబం.. ఉన్నతమైన భావజాలం..
  • విద్యార్థి నాయకుడిగా సమాజంలో తనవంతు పాత్ర..
  • నిజాయితీతో కూడిన అంచెలంచెల ప్రయాణం..
  • రాత్రి పగలు తేడా లేకుండా ప్రజా సేవకే అంకితం..
  • ప్రభుత్వంలో భాగస్వామ్యమైతే సేవ చేయోచ్చు..

డా. పైడి యెల్లా రెడ్డి.. ఒక నిజమైన నాయకుడు. దృఢనిశ్చయంతో, నమ్మకంతో, పట్టుదలతో, ప్రజలను అనుక్షణం శక్తివంతులుగా చేస్తూ అభివృద్ధి వైపు తీసుకెళ్తున్న వ్యక్తి. నిజాయితీతో కూడిన ఈ ప్రయాణంలో తన నియోజకవర్గ ప్రజలను అపారమైన సానుభూతితో అర్థం చేసుకుని, వారికి అండగా నిలుస్తూ, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.. తన ప్రజలకు అవసరం ఉన్నప్పుడు, తాను వారి మధ్య ఉండటం ద్వారా ప్రజల మనిషిగా ఆయన తనను తాను నిరూపించుకున్నారు.. వసుదైక కుటుంబ భావనతో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, ప్రజలను ప్రస్తుత స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్లే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.. భారతదేశాన్ని విశ్వ గురువుగా తీర్చిదిద్దే మహాయజ్ఞంలో భాగస్వామ్యం అవుతూ, దాన్ని సాధించే శక్తి కలిగిన వారు డా. పైడి యెల్లారెడ్డి.. తన లక్ష్యం దృఢనిశ్చయం, కష్టపడి పని చేయడం, సేవాభావంతో ముందుకు సాగడం. ఇదే ఆయన విజన్‌..

ఇక జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు ఆలోచిస్తున్నారు.. ఇది లోక్‌సభలో అత్యంత వెనుకబడిన ప్రాంతం కాబట్టి, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రతి యువకుడికి చేరేలా చూసి, ఉపాధి అవకాశాలు సృష్టించడం, వ్యవసాయరంగంలో కొత్త ధోరణులు తీసుకురావడం, 100శాతం అక్షరాస్యత సాధించడం, సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందించడం.. రహదారి, రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, గ్రామీణ, పట్టణ అనుసంధానం పెంచడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దీర్ఘకాలిక అభివృద్ధి సాధించడం.. భారతీయ జనతా పార్టీ ఆదేశాల ప్రకారం తన బాధ్యతగా స్వీకరిస్తాను అని సగౌరవంగా చెబుతుంటారు.. ఇదే ఆయన మిషన్‌..

డా. పైడి యెల్లా రెడ్డి.. ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.. సామాన్య వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినా ఆయనలో ఆశయాలు మాత్రం ఎంతో ఉన్నతంగా ఉంటాయి.. చిన్నతనం నుంచే ఆయనలో సేవా భావం నిబిడీకృతమై ఉంది.. తాను పుట్టిన ప్రాంతానికి ఏదైనా చెయ్యాలనే బలమైన కోరిక ఆయనలో చిన్నతనం నుంచే మొదలైంది.. ఉన్నతమైన చదువులు చదివారు.. ఎన్నెన్నో ఉన్నతమైన విధులు నిర్వహించారు..

మార్చి 1, 1963, కామారెడ్డి జిల్లా, దేవాయిపల్లి గ్రామంలో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో విఠల్‌ రెడ్డి, రాధమ్మ దంప తులకు జన్మించారు.. ఈయనకు భార్య: రత్నమాల, కుమార్తె: డా. సమ్యుక్త రెడ్డి (ఎం.డి.), కుమారుడు: డా. సాయికృష్ణ రెడ్డి (ఎం.డి.) లు ఉన్నారు. సర్కార్‌ పాఠశాలలో విద్యను అభ్యసించి సైంటిస్ట్‌ వరకు ఎదిగారు. జెడ్పీహెచ్‌ఎస్‌, తాడ్వాయి లో అభ్యసించారు.. గొప్ప విషయం ఏమిటంటే ఆయన తన గ్రామంలో మొదటి తరం గ్రాడ్యుయేట్‌ కావడం.. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి కెమిస్ట్రీలో పీజీ అండ్‌ ఎల్‌.ఎల్‌.బి పూర్తి చేశారు. ఈయన కెమిస్ట్రీలో టాపర్‌.. భారత ప్రభుత్వంలో సిఎస్‌ఐఆర్‌ నేషనల్‌ ఫెలోషిప్‌.. నేషనల్‌ కెమికల్‌ లాబొరేటరీ, పుణే, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ లో పిహెచ్‌.డి కూడా చేశారు.

అటు పిమ్మట జపాన్‌ ప్రభుత్వ ఆహ్వానం మేరకు నాగోయా ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో విజిటింగ్‌ సైంటిస్టుగా పనిచేశారు. ఆ తరువాత జపాన్‌లో టయోటా గ్రూప్‌ కంపెనీలో చేరారు. 20 ఏళ్లకు పైగా టయోటా గ్రూప్‌లో విభిన్న బాధ్యతలపై పని చేశారు. అనేక జపాన్‌ కంపెనీలను భారతదేశంలో స్థాపించడానికి ప్రేరణనిచ్చి, సమన్వయం చేసి, ముందడుగు వేశారు. భారతదేశంలో టయోటా గ్రూప్‌ కంపెనీకి చెందిన ఆర్‌అండ్‌డీ సెంటర్‌ను స్థాపించి, అధిపతిగా కూడా వ్యవహరించి ఘనత సాధించారు.

భారత ప్రభుత్వ సంస్థలు, జపాన్‌ పరిశ్రమలతో సహకార పరిశోధనకు అవకాశం కల్పించారు. ఎనర్జీ రంగంలో అనేక కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ప్రవేశపెట్టడంలో ఈయన పయనీర్‌ అని చెప్పవచ్చు.. 70కి పైగా అంతర్జాతీయ పేటెంట్లు వీటిలో కొన్నింటిని భారత ప్రభుత్వంతో కలిసి దాఖలు చేశారు. ప్రపంచ టాప్‌ 10 విశ్వవిద్యాలయాల్లో ఒకటైన టోక్యో యూనివర్సిటీలో విజిటింగ్‌ ప్రొఫెసర్‌ గా పనిచేశారు. ఫారెస్ట్రీ, కెమిస్ట్రీ, లీగల్‌, పాలిటికల్‌ సైన్సెస్‌, ఇంటర్నేషనల్‌ లా వంటి విభిన్న రంగాల్లో బహుళ డిగ్రీలు, ప్రతిభలు సంపాదించారు. 2005లో సపాలా ఆర్గానిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ను స్థాపించి, ఫార్మా పరిశోధన, తయారీలో ముందడుగు వేశారు. ఇక ఆయన చేసిన నాకెందుక కార్యకలాపాలు, సామాజిక సేవలు అన్యన్య సామాన్యం అని చెప్పుకోవచ్చు.

40 ఏళ్లకు పైగా ఏబీవీపీతో విద్యార్థి నాయకుడిగా అనుబంధం. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలకు సహకారం అందించి, ఏబీవీపీ రాష్ట్ర కార్యాలయం నిర్మాణానికి సహాయం చేశారు. నిరంతరం ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ అనుబంధ సంస్థలు అయిన భజరంగ్‌ దళ్‌, వీ.హెచ్‌.పీ., అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక మహాసంఫ్‌ు, భారతీయ కిసాన్‌ సంగ్‌ లకు మద్దతునిచ్చారు. సనాతన ధర్మం, హిందుత్వ రక్షణలో ముందుండి. స్వయంగా కొన్ని దేవాలయాలు నిర్మించి, 100కిపైగా దేవాలయాల పునరుద్ధరణ/పునర్నిర్మాణానికి సహకారం అందించారు.

గ్రామీణ ప్రాంతాల్లో 150కు పైగా సురక్షిత త్రాగునీటి ప్లాంట్లు ఏర్పాటు చేశారు. మహిళా సాధికారత, స్వయం ఉపాధి కోసం కుట్టు యంత్రాలు, నైపుణ్యాభివృద్ధి సాయం అందించారు.. 800కి పైగా ఉద్యోగావకాశాలు కల్పిం చారు.. ముఖ్యంగా గ్రామీణ యువతకు అవకాశం కల్పించారు. అనేక మందిని జపాన్‌లో ఉన్నత విద్య కొనసాగించేందుకు సహ కరించారు. ఆదివాసి పిల్లల విద్యా సహాయం చేసిన ఉన్నతమైన మనసు ఆయనది. యూని ఫార్ములు, పుస్తకా లు, బెంచీలు, పాఠశాల అవసరాలు తీర్చారు.

కోవిడ్‌ మహమ్మారి సమయంలో. గ్లోబల్‌ ఎం.ఆర్‌.ఎన్‌.ఏ. వ్యాక్సిన్‌ ఉత్పత్తికి కీలక మధ్యవర్తి రసాయనాల అభివృద్ధి, సరఫరాలో కీలక పాత్ర పోషించారు. అడ్వకేట్‌ బార్‌ అసోసియేషన్లు, పోలీస్‌ శాఖ సంక్షేమం, జిల్లా కేంద్రమైన కామారెడ్డిలో యోగా భవన నిర్మాణంలో తన వంతు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది.వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతునిచ్చారు.

ఇక ఆయన రాజకీయ ప్రయాణం గురించి చెప్పుకుంటే.. డా. పైడి యెల్లారెడ్డి. జహీరాబాద్‌ లోక్‌సభ సీటును ఆశించిన ప్రధాన నాయకుడు.. అయితే పార్టీ తుది నిర్ణయాన్ని గౌరవించి, పార్టీ నిర్ధేశించిన అభ్యర్ధికి తన పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారు. యెల్లారెడ్డి అసెంబ్లీ విభాగంలో బీజేపీకి అత్యధిక మెజారిటీ వచ్చేలా కీలక పాత్ర పోషించారు.

ఆయన భవిష్యత్‌ లక్ష్యం :

ప్రస్తుతం పార్టీ కార్యకలాపాలు, సామాజిక సేవలో చురుకుగా కొనసాగుతూ.. సమాజ సేవ కోసం ప్రభుత్వంలో ఒక పాత్ర పోషించాలనే ఆకాంక్షతో ఉన్నారు.. కాగా ఆయన పలు రంగాల్లో పార్టీ మద్దతును ఆశిస్తున్నారు..
రసాయనాలు, ఔషధ పరిశ్రమ.. జపాన్‌తో అంతర్జాతీయ సంబంధాలు.. పీసీబీ.. ఆహార ప్రాసెసింగ్‌.. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ.. మానవ వనరులు, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో సేవ చేయడానికి బీజేపీ అధిష్టానం నుంచి తనకు మద్దతు కావాలని ఆశిస్తున్నారు.. అదే విధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక పాత్ర పోషించడానికి, బీజేపీ సభ్యత్వ కార్యక్రమంలో చురుకైన పాత్రను చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు.

డాక్టర్‌ పైడి ఎల్లారెడ్డి ఎన్నెన్నో అవార్డులు, గొరవ పురస్కారాలు అందుకున్నారు. 1987లో సి.ఎస్‌.ఐ.ఆర్‌.- యూ.జీ.సి. జాతీయ జాయింట్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌.. స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌, భారత ప్రభుత్వం ద్వారా టాప్‌ ర్యాంక్‌.. సి.ఎస్‌.ఐ.ఆర్‌. జూనియర్‌, సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌. 1993లో డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రీసెర్చ్‌ అసోసియేట్‌ ఫెలోషిప్‌. 1994లో జపాన్‌ మోన్బుషో రీసెర్చ్‌ ఫెలోషిప్‌. 1998లో ఏషియన్‌ కాస్మోస్‌ ఆర్‌ అండ్‌ డీ కంపెనీ లిమిటెడ్‌ క్రియేటివ్‌ రీసెర్చర్‌ అవార్డు.. 2018లో తెలంగాణ ఉత్తమ పారిశ్రామికవేత్త అవార్డు.. అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ బిజినెస్‌ ఆఫ్‌ ఎక్స లెన్స్‌ అవార్డు. ఇంకా జపాన్‌లో అత్యున్నత పరిశోధన అవార్డులు ఆయనను వరించాయి. ఇక 1998 నుంచి అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ సభ్యత్వం.. జపాన్‌ కెమికల్‌ సొసైటీ.. ఆర్గానిక్‌ సింథసిస్‌ సొసైటీ ఆఫ్‌ జపాన్‌ లో సభ్యుడిగా.. ఐ.ఐ.సి.టి. సైన్స్‌ ఫౌండేషన్‌ సభ్యుడు.. ఐ.ఎస్‌. 3 ఎన్‌.ఏ. అంతర్జాతీయ న్యూక్లియోటైడ్స్‌ సొసైటీ సభ్యుడుగా గురుతర బాధ్యతలు నిర్వహించారు.

సామాజిక సేవలో ఆయన జీవితం పునీతం చేసు కున్నారు.. ఏబీవీపీ.తో 40 ఏళ్లకుపైగా అనుబంధం.. ఆర్‌.ఎస్‌. ఎస్‌., బీజేపీ అనుబంధ సంస్థలైన వీ.హెచ్‌.పీ., ఏ.బీ.ఆర్‌.ఎస్‌. ఎం., రైతు సంఘాలతో సహకారం.. అలాగే వికసిత్‌ భారత్‌ 2047 కోసం.. యువత ఉపాధి, రైతులకు జపాన్‌ టెక్నిక్‌లు, మహిళా సాధికారత, పేదలకు మద్దతు.. 100కి పైగా ఆలయాల పున రుద్ధరణ, కొత్త ఆలయాల నిర్మాణం.. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో పాఠశాల పిల్లలకు విద్యా సహాయం.. మహిళలకు కుట్టు మిషన్లు అందించి స్వయం ఉపాధి కల్పన.. వృద్ధులు, దివ్యాంగులకు సహాయం, పల్లెల్లో నీటి ప్లాంట్లు ఏర్పాటు, చెట్ల నాటడం.. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు మద్దతునివ్వడం.. పల్లె విద్యా ర్థుల ను జపాన్‌లో ఉన్నత విద్యకు పంపడం, ఉపాధి అవకాశాలు కల్పి ంచడం.. ఇక సపల ఆర్గానిక్స్‌ ద్వారా 800 మందికి పైగా ఉపాధి..

పైడి యెల్లా రెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం.. ప్రభుత్వ ఆసుపత్రులకు పరికరాలు అందించడం.. 150కి పైగా గ్రామాల్లో తాగునీటి ప్లాంట్లు ఏర్పాటు చెయ్యడం.. గ్రామీణ విద్యకు మద్దతునివ్వడం.. వృక్షా రోపణ కార్యక్రమాలు చేపడ్డటం.. మహిళా సంక్షేమ కార్యక్ర మాలు నిర్వహించడం.. గ్రామీణ ఉపాధి అవకాశాలను సృష్టిం చడం లాంటి ఎన్నెన్నో మహోన్నత కార్యక్రమాలు చేపట్టారు..

డా. పైడి యెల్లా రెడ్డి.. ఒక శాస్త్రవేత్త, పారిశ్రామి కవేత్త, ప్రజాసేవకుడు, భారతీయ జనతా పార్టీతో కలసి జహీరా బాద్‌ ప్రజల అభ్యున్నతికి అంకితం అవ్వాలనే మహోన్నత ఆశయంతో ముందుకు సాగుతున్న ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన మహామనీషి.. సపల ఆర్గానిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు ప్రెసిడెంట్‌, సిఇఓ గా అత్యున్నత భాద్యతలు.. భారతీయ జనతా పార్టీ, తెలంగాణ, ప్రాధమిక సభ్యుడిగా కొనసాగుతున్నారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News