Wednesday, April 1, 2026
HomeతెలంగాణKaushik Reddy | ప్రశ్నిస్తే మాపై కేసులు పెడుతున్నారు..

Kaushik Reddy | ప్రశ్నిస్తే మాపై కేసులు పెడుతున్నారు..

  • పాడి కౌశిక్ రెడ్డి ఫైర్..
  • మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలి..

రాష్ట్రంలో జరిగే మైనింగ్ స్కామ్‌ను హరీశ్‌రావు అసెంబ్లీలో ఆధారాలతో సహా బయటపెట్టారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. మైనింగ్ స్కామ్ మీద హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశామని పేర్కొన్నారు. హౌస్ కమిటీ వేయడానికి సీఎం రేవంత్ రెడ్డికి ఏం సమస్య అని ప్రశ్నించారు. హైదరాబాద్‌‌‌లోని తెలంగాణ భవన్‌లో పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దీనిపై సీఐడీ ఎంక్వైరీ వేస్తామని ప్రభుత్వం చెబుతోందని..

మంత్రి మీద సీఐడీ ఎంక్వైరీ వేస్తే న్యాయం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. మంత్రిని సీఐడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంటుందా అని పాడి కౌశిక్ రెడ్డి అడిగారు. అందుకే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశామని తెలిపారు. అయితే దానం నాగేందర్ కడియం శ్రీహరితో ముఖ్యమంత్రి మాట్లాడించారని చెప్పారు. దానం నాగేందర్ నోటికొచ్చినట్లు మాట్లాడి బెదిరించారని తెలిపారు.

- Advertisement -

అన్నం పెట్టిన కేసీఆర్ గురించి కడియం శ్రీహరి తప్పుగా మాట్లాడారని పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. కడియం శ్రీహరికి కేసీఆర్ ఏం తక్కువ చేశారని ప్రశ్నించారు. సిట్టింగ్ఋను కాదని కడియం శ్రీహరికి కేసీఆర్ టికెట్ ఇచ్చారని గుర్తుచేశారు. అందుకే నువ్వు ఏ పార్టీలో ఉన్నావని కడియం శ్రీహరిని అడిగామని తెలిపారు. తనతో పాటు బీఆర్ఎస్ సభ్యులందరూ అడిగారని.. ఇది తప్పా అని నిలదీశారు. కాంగ్రెస్ వాళ్ల దగ్గర ఎందుకు కూర్చున్నావని ప్రశ్నించాం.. అది తప్పా అని ప్రశ్నించారు. నువ్వు ఏ పార్టీ పక్షాన మాట్లాడుతున్నావని కడియం శ్రీహరిని అడిగామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News