- వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి ఫిర్యాదు
- దర్యాప్తు చేస్తున్న మొయినాబాద్ పోలీసులు
గుర్తు తెలియని దొంగలు ఆలయంలోకి చొరబడి వెంకటేశ్వర స్వామివారి బంగారు ఆభరణాలు, హుండీలోని నగదును దొంగిలించారు. ఈ ఘటన ఆదివారం రాత్రి మొయినాబాద్ పోలీస్టేషన్ పరిధిలోని కనకమామిడి గ్రామంలో చోటుచేసుకుంది. ఆలయ చైర్మన్ కొండా లక్ష్మీ కాంత్ రెడ్డి ఫిర్యాదుమేరకు సోమవారం కేసునమోదు చేసుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, ఫిర్యాదుదారుడు తెలిపిన సమాచారం మేరకు…
ఆదివారం రాత్రి కనకమామిడి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి అమ్మవారి (సుమారు రూ. మూడు లక్షల డెబ్భై వేలు) ఆభరణాలు, భూదేవి అమ్మవారి (సుమారు రెండు లక్షల పదివేలు) ఆభరణాలు, రెండు హుండీ లలో గల సుమారు రూ. లక్షా పదిహేనువేల నగదు, మొత్తం రూ. ఆరు లక్షల 95 వేల విలువగల మొత్తము చోరీకి గురైంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న మొయినాబాద్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆలయ ఆవరణలో, సమీపంలోగల సీసీ టీవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
