Thursday, February 26, 2026
HomeజాతీయంRahul Gandhi | కేంద్ర బడ్జెట్ కేవలం 5 శాతం మందికే..

Rahul Gandhi | కేంద్ర బడ్జెట్ కేవలం 5 శాతం మందికే..

  • బడ్జెట్ పై పెదవి విరిచిన విపక్షాలు..
  • నిరుద్యోగం, రైతుల కష్టాలను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది : రాహుల్ గాంధీ
  • స్టాక్ మార్కెట్ పతనానికి బడ్జెట్టే కారణం : అఖిలేశ్ యాదవ్
  • మధ్యతరగతి, రైతులు, కార్మికులకు తీవ్ర నిరాశే మిగిలింది..

తాము ప్రవేశపెట్టిన బడ్జెట్ వికసిత్ భారత్ దిశగా ఉందని కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉంటే.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్పై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. దేశం ఎదుర్కొంటున్న వాస్తవ ఆర్థిక, సామాజిక సవాళ్లను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నిరుద్యోగం, తయారీ రంగం క్షీణత, రైతుల కష్టాలు వంటి కీలక సమస్యలను పరిష్కరించడంలో ఈ బడ్జెట్ ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు.

ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా రాహుల్ గాంధీ స్పందించారు. “ఉద్యోగాలు లేని యువత, పడిపోతున్న తయారీ రంగం, దేశం నుంచి తరలిపోతున్న పెట్టుబడులు, కుప్పకూలుతున్న కుటుంబ పొదుపు, రైతుల కష్టాలు, పొంచివున్న ప్రపంచ ఆర్థిక సంక్షోభాలు… వీటన్నింటినీ బడ్జెట్ పట్టించుకోలేదు. దిద్దుబాటు చర్యలకు నిరాకరిస్తున్న ఈ బడ్జెట్, భారతదేశ వాస్తవ సంక్షోభాల పట్ల గుడ్డిగా వ్యవహరిస్తోంది” అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. రాహుల్ పాటు ఇతర విపక్ష నేతలు కూడా బడ్జెట్పై పెదవివిరిచారు.

- Advertisement -

వృద్ధిని పునరుద్ధరించడానికి, ఉపాధి కల్పించడానికి ఇందులో సరైన సంస్కరణలు లేవని విమర్శించారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మరో అడుగు ముందుకేసి, స్టాక్ మార్కెట్ పతనానికి బడ్జెట్టే కారణమని ఆరోపించారు. “బీజేపీ బడ్జెట్ ఫలితం ఇదిగో.. షేర్ మార్కెట్ భారీగా కుప్పకూలింది. ఆదివారం మార్కెట్ తెరుస్తారా లేదా అన్నది ప్రశ్న కాదు, అది ఇంకా ఎంత పడిపోతుందన్నదే అసలు ప్రశ్న అని మేము ముందే చెప్పాం” అని ఆయన అన్నారు.

ఈ బడ్జెట్ కేవలం 5 శాతం మంది ప్రజల కోసమేనని, కమీషన్లు దక్కించుకోవడానికి, బీజేపీ సొంత వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చడానికే దీన్ని రూపొందించారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. “ఇది బీజేపీ తరహా అవినీతికి కంటికి కనిపించని లెక్కల చిట్టా” అని అఖిలేష్ అభివర్ణించారు. అనియంత్రితంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం సమయంలో పన్ను ఉపశమనం కల్పించకపోవడం ‘పన్ను దోపిడీ’ కిందకే వస్తుందని ఆయన విమర్శించారు. సంపన్నులకు వ్యాపారం, ప్రయాణాల కోసం పదుల రకాల మినహాయింపులు ఇచ్చి, నిరుద్యోగులకు మాత్రం ‘ఆశల ఖాళీ పళ్లెం’ చూపించారని ఎద్దేవా చేశారు.

ఈ బడ్జెట్ వల్ల మధ్యతరగతి ప్రజలు పూర్తిగా మోసపోయినట్లు భావిస్తున్నారని, పేదలు మరింతగా కుంగిపోతున్నారని అన్నారు. రైతులు, కార్మికులు, చిరు వ్యాపారులు టెలిస్కోప్ వెతికినా తమ కోసం ఇందులో ఏమీ కనిపించలేదని, ఇది తీవ్ర నిరాశాజనకమైన, దారుణమైన బడ్జెట్ అని అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News