Tuesday, February 10, 2026
HomeజాతీయంParliament | లోక్ సభ స్పీకర్ పై అవిశ్వాసానికి రెడీ

Parliament | లోక్ సభ స్పీకర్ పై అవిశ్వాసానికి రెడీ

  • ఓం బిర్లాను తొలగించేందుకు ప్రతిపక్షాల ప్లాన్..
  • ఇండియా బ్లాక్ సమావేశంలో ఈ విషయంపై చర్చ!

ప్రతిపక్ష పార్టీలు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను తొలగించేందుకు రెడీ అవుతున్నాయని తెలుస్తోంది.. ఆయనపై అవిశ్వాస తీర్మానం తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయని సమాచారం అద్నడుతోంది.. పలు నివేదికల ప్రకారం.. కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ఏర్పాటు చేసిన ఇండియా బ్లాక్ సమావేశంలో ఈ విషయం చర్చించినట్లు తెలుస్తోంది..

రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని సభలో మాట్లాడటానికి అనుమతించకపోవడం వంటి అనేక కారణాలు దీనికి ఆజ్యం పోశాయని టాక్. బడ్జెట్ సమావేశాల మొదటి వారంలో స్పీకర్ ఓం బిర్లా ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. వారిలో ఏడుగురు కాంగ్రెస్ సభ్యులు కూడా ఉన్నారు.

- Advertisement -

రాజ్యాంగంలోని ఆర్టికల్ 94-సి కింద ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. స్పీకర్ ను తొలగించడం, ధన్యవాద తీర్మానంపై ప్రతిపక్ష నాయకుడు మాట్లాడకుండా నిరోధించడం, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేపై చర్య తీసుకోవడంలో వైఫల్యానికి వ్యతిరేకంగా ఈ తీర్మానం నోటీసు దాఖలు చేశారు. కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధారమైన ఆరోపణలు చేయడం, ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం వంటివి ఈ తీర్మానం ప్రవేశ పెట్టడానికి కారణం అయ్యాయన చెబుతున్నారు.

లోక్సభ స్పీకర్ ను తొలగించే విధానం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 94లో వివరించారు. సభలో ఆమోదించిన ప్రత్యేక తీర్మానం ద్వారా మాత్రమే స్పీకర్ ను తొలగించవచ్చని ఈ చట్టం పేర్కొంది. ఈ ప్రక్రియ అనేక షరతులకు లోబడి ఉంటుంది. స్పీకర్ ను తొలగించడానికి, మొదట సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతారు. తీర్మానానికి 14 రోజుల ముందుగానే నోటీసు ఇవ్వాలి. ముఖ్యంగా లోక్ సభలో కనీసం 50 మంది సభ్యులు మద్దతు ఇస్తేనే ఈ తీర్మానాన్ని అమలు చేయవచ్చు.

ఈ కనీస మద్దతు లేకుండా, తీర్మానాన్ని సభలో ఆమోదించరు. 14 రోజుల ముందుగానే ఇవ్వాల్సిన నోటీసుకు 50 మంది సభ్యుల సంతకాలు కూడా అవసరం. నోటీసు ఆమోదించిన తర్వాత, ఈ తీర్మానంపై స్పీకర్ చర్చకు తేదీని నిర్దేశిస్తారు. చర్చకు తేదీ 10 రోజులు మించకూడదు. లోక్ సభలో హాజరై ఓటు వేసే ఎంపీలలో సాధారణ మెజారిటీ తీర్మానానికి మద్దతు ఇస్తే స్పీకర్ పదవి నుంచి తొలగిస్తారు. రాజ్యాంగ సవరణల విషయంలో ఉన్నట్లుగా, ఓటింగ్ ప్రక్రియకు 2/3 వంతు మెజారిటీ అవసరం లేదు. కేవలం మెజారిటీ సరిపోతుంది.

లేదు. లోక్సభ స్పీకర్ ను తొలగించే తీర్మానం చర్చకు వచ్చినప్పుడు, స్పీకర్ సభకు అధ్యక్షత వహించరు. డిప్యూటీ స్పీకర్ సభ్యుల కోసం కార్యకలాపాలను నిర్వహిస్తారు. ఈ తీర్మానం ఆమోదం పొందితే, స్పీకర్ వెంటనే తన పదవి నుంచి వైదొలగాల్సి వస్తుంది. కానీ పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతారు. ఈ ప్రక్రియ తర్వాత, లోక్సభకు కొత్త స్పీకర్ ఎన్నికవుతారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News