Sunday, March 1, 2026
Homeఆరోగ్యంMIMS | ఆప్తమాలజీ చర్చా కార్యక్రమం

MIMS | ఆప్తమాలజీ చర్చా కార్యక్రమం

మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌(Medicity Institute of Medical Sciences-MIMS)లో ఆప్తమాలజీ (Ophthalmology) విభాగాన్ని ప్రపంచ శ్రేణిలో అభివృద్ది చేయడానికి సాంకేతిక నైపుణ్యంతోపాటు సహకారాన్ని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ (LV Prasad Eye Institute) అందించనుంది. MIMS ఆప్తమాలజీ విభాగం నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత కంటి వైద్య నిపుణుడు డాక్టర్ నర్సింగరావు, డాక్టర్ గుల్లపల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు. భవిష్యత్తులో వైద్య చికిత్సలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషించనుందని చెప్పారు.

మేడ్చల్ ఘన్‌పూర్‌లోని MIMSలో కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్(Continuous Professional Development) కార్యక్రమం కింద కంటి పరిస్థితులపై సమగ్ర అవలోకనం(COMPREHENSIVE OVERVIEW OF CURRENT OPHTHALMIC CONDITIONS) అనే విషయంపై చర్చ నిర్వహించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో పద్మశ్రీ డా.గుల్లపల్లి నాగేశ్వరరావు, వ్యవస్థాపకులు, ఛైర్మన్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్‌తోపాటు అమెరికాలో ప్రఖ్యాతి గడించిన కంటి వైద్య నిపుణులు, పరిశోధకులు, అమెరికాలో ఒక విశ్వవిద్యాలయానికి డీన్‌గా నియమించబడిన మొట్టమొదటి భారతీయుడు, తెలుగువారు అయిన డా.నర్సింగరావు, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాతోపాటు డాక్టర్ పద్మజా కుమార్ రాణి, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌ వైద్య నిపుణులతోపాటు డాక్టర్ మధు కె మోహన్, ఛైర్మన్, షేర్ మెడికల్ కేర్ ఫౌండేషన్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News