జీవిత బడుగు సమర్పణలో ఏకారి ఫిలిమ్స్ పతాకంపై రఘు రామ్ హీరోగా, శృతి శెట్టి(Krithi Shetti), నైనా పాఠక్ హీరోయిన్స్‌గా ఇదివరకే పలు చిత్రాలకి దర్శకత్వం వహించిన సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం “ఓహ్!”. కాశ్మీర్, కులుమునాలి, ఆగ్రా, ఢిల్లీ, గోవా, హైదరాబాద్ వరంగల్ వంటి అందమైన ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకొని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఈ నెల 19న విడుదలకు సిద్ధమైంది. హీరోయిన్ నైనా పాఠక్ మాట్లాడుతూ.. ‘యూత్‌కి కావలసిన అన్ని హంగులు, రొమాన్స్ ఇందులో ఉన్నాయి. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’ అని పేర్కొన్నారు.

ఈ సందర్బంగా చిత్ర సమర్పకురాలు బీఆర్ఆర్ గ్రూప్స్ అధినేత్రి జీవిత బడుగు మాట్లాడుతూ.. తామ బిజినెస్(Business)లో కస్టమర్స్(Customers)కు అద్భుతమైన క్వాలిటీ అందిస్తున్నామని చెప్పారు. ఓహ్ మూవీని కూడా అంతే క్వాలిటీతో ప్రేక్షకులకు అందిస్తున్నామని తెలిపారు. దర్శక నిర్మాత సత్యనారాయణ ఏకారి మాట్లాడుతూ.. “ఐదు చిత్రాలను నిర్మించిన అనుభవంతో ఒక కొత్త జోనర్‌లో, క్రోమోఫోబియా(Chromophobia)ని పాయింట్‌గా తీసుకొని ఈ చిత్రం రూపొందించాం. కాశ్మీర్ ప్రాంతంలో పూర్తి షూట్ చేశాం. ఈ నెల 19న రిలీజ్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

హీరో రఘురామ్ మాట్లాడుతూ.. ‘ఓహ్ మూవీతో మీ అందరి ముందుకు వస్తున్నాను. సిల్వర్ స్క్రీన్ మీద ఇంతవరకు రాని అందమైన ప్రేమ కావ్యంతో ఈ చిత్రం వస్తోంది. నా మొదటి చిత్రం కథ కోసం ఎంతో రీసెర్చ్ చేసి నేను అద్భుతమైన కథ, కథనం, మాటలు రాశాను. మీ అందరితో ఓహ్ అనిపిస్తాను. సాక్షాత్తూ ఆ పరమశివుడు కొలువై ఉన్న హిమాలయాలంత (Himalayas) స్వచ్ఛమైన చిత్రమిది’ అని అన్నారు. హీరోయిన్ శృతి శెట్టి మాట్లాడుతూ.. ‘టైటిల్‌తోపాటు సినిమా చాలా బాగుంటుంది. కాశ్మీర్ మంచు కొండల్లో ముఖ్యంగా కెమెరా వర్క్, స్టోరీ చాలా బాగుంది. సినిమా చూడాలనే ఇంట్రస్ట్ కలుగుతుంది’ అని చెప్పారు.

