Friday, October 3, 2025
ePaper
Homeఎన్‌.ఆర్‌.ఐమాగంటి గోపినాథ్‌కు ఎన్‌ఆర్‌ఐల నివాళి

మాగంటి గోపినాథ్‌కు ఎన్‌ఆర్‌ఐల నివాళి

జూన్ 8న ఆదివారం ఉదయం కన్నుమూసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత మాగంటి గోపీనాథ్‌కి ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) ఘనంగా నివాళులు అర్పించారు. లండన్‌లోని నాన్ రెసిడెంట్ ఇండియన్లు సంతాపం ప్రకటించారు. గోపీనాథ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. శాసన సభ్యుడు మాగంటి గోపినాథ్ అకాల మరణం బీఆర్ఎస్ పార్టీకి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని బీఆర్‌ఎస్ పార్టీ యూకే చీఫ్ నవీన్ రెడ్డి అన్నారు.

ఎన్నారైలతో గోపీనాథ్‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. గోపీనాథ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతిచేరాలని దేవుణ్ని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యూకే డిప్యూటీ ప్రెసిడెంట్ సత్యమూర్తి చిలుముల, అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ శ్రీకాంత్ జెల్ల, సెక్రెటరీ అబ్దుల్ జాఫర్, ఐటీ అండ్ మీడియా సెక్రెటరీ పీఆర్ రవిప్రదీప్ పులుసు, ట్రెజరర్ సురేష్ బుడగం, ఈవెంట్స్ బాధ్యులు తరుణ్ లునావత్, టాక్ మెంబర్స్ స్వాతి బుడగం, సుప్రజ పులుసు, శైలజ జెల్లా, శ్రీవిద్య, క్రాంతి రేటినేని తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News