Monday, February 23, 2026
Homeరంగారెడ్డిNandigama | క్రీడలతో పాటు చదువులో రాణించాలి.

Nandigama | క్రీడలతో పాటు చదువులో రాణించాలి.

  • సర్పంచ్ కొమ్ము కృష్ణ.
  • ఎన్ పిఎల్- 12 విజేత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.
  • సహాయసహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం.

గ్రామంలోని యువత క్రీడలతో పాటు చదువులో రాణించాలని సర్పంచ్ కొమ్ము కృష్ణ పేర్కొన్నారు. నందిగామ మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్ పిఎల్- 12 క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం విజయవంతంగా ముగిసింది.ఫైనల్ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కత్తా నైట్ రైడర్స్ టీములు పోటీ పడ్డాయి.నిర్ణీత 16 ఓవర్లలో చెన్నై టీమ్ 6 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది.కోల్ కత్తా టీమ్ 103 పరుగులకే అలౌట్ కావడంతో 39 పరుగుల తేడాతో చెన్నై గెలుపొందింది.

ఈ క్రీడాకారులకు స్థానిక సర్పంచ్ కొమ్ము కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులతో పాటు విన్నర్ కి 30వేల రూపాయలు, రన్నర్ కి 20వేల రూపాయలు అందజేసి, అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత, క్రీడాకారులు క్రీడలతో పాటు చదువులో రాణించాలని అన్నారు. చదువుకుంటే ఎక్కడున్నా రాజుల బతకొచ్చన్నారు.అలాగే నిత్యం క్రీడలు ఆడటంతో ఆరోగ్యంగా ఉంటామన్నారు.ప్రతిభ కలిగిన క్రీడాకారులకు సహాయ, సహకారాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జంగ నర్సింలు,ఉప సర్పంచ్ ఎర్ర వెంకటేష్,మాజీ సర్పంచ్ జెనిగే జగన్,మాజీ ఎంపిటిసిలు చంద్రపాల్ రెడ్డి,కుమారస్వామి,వార్డు సభ్యులు శివగళ్ల ప్రవీణ్,నాయకులు బి.కృష్ణ,మోడుసు శ్రీను,నెరేళ్ల గోవర్ధన్ రెడ్డి,బొర్ర ప్రవీణ్ రెడ్డి,చాకలి బాల్ రాజ్,మోడుసు నర్సింహా,సి.కృష్ణ,టోర్నమెంట్ ఆర్గనైజర్లు,క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News