జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో సెక్షన్ 163 అమలు
ప్రజలకు పోలీసుల హెచ్చరిక
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో సనత్ నగర్ (Sanath Nagar) పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డ (Erragadda) డివిజన్ ప్రజలకు సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police) కీలక సూచనలు జారీ చేశారు. మంగళవారం పోలింగ్ (Polling) జరగనున్న దృష్ట్యా రానున్న 48 గంటల్లో ఎన్నికల ప్రచారం, బహిరంగ సభలు నిర్వహించడాన్ని నిషేధించినట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని నివాసాలు, హోటళ్లు, లాడ్జిల్లో స్థానికేతరులు (Non-Locals) బస చేయరాదని సూచించారు.
సౌండ్ బాక్సులు, మైక్‌ల వాడకాన్నీ బ్యాన్ చేసినట్లు తెలిపారు. సైబరాబాద్ సీపీ ఆదేశాల మేరకు ఈ నియోజకవర్గ పరిధిలో బీఎన్ఎస్ఎస్ (BNSS) సెక్షన్ 163 (Section 163) అమల్లో ఉంటుందని, ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలో మద్యం దుకాణాలు(Liquor Shops), కల్లు కాంపౌండ్లు, బార్లలో విక్రయాలు జరగవని, ఎన్నికలు ముగిసే వరకు మూసి ఉంటాయని బాలానగర్ డివిజన్ ఏసీపీ పింగిలి నరేష్ రెడ్డి పేర్కొన్నారు.
