Monday, January 19, 2026
EPAPER
Homeరంగారెడ్డిEducation | ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి వంతమైన ఆయుధం విద్య

Education | ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి వంతమైన ఆయుధం విద్య

  • సెరినిటీ పాఠశాలల వ్యవస్థాపకులు నోముల వసంత

ప్రపంచాన్ని మార్చగలిగే అత్యంత శక్తి వంతమైన ఆయుధం విద్య అని, త్రికరణ శుద్ధి గా నేర్చుకొని, సాధన చేసినపుడు మాత్రమే విజయం సిద్దిస్తుందని, నాగారం, రాంపల్లి….. సెరినిటి పాఠశాలల వ్యవస్థాపకులు నోముల వసంత తెలిపారు. సోమవారం నాగారం సెరినిటి పాఠశాల ఆవరణలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు మరియు సంక్రాంతి సందర్బంగా రంగవల్లుల పోటీలను ఘనంగా నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండంట్ నోముల జంగిరెడ్డి మాట్లాడుతూ..

సంక్రాంతి దేశంలో రకరకాల పేర్లతో జరుపుకుంటారని, రంగవల్లులు మన సంసృతి, సాంప్రదాయాలను ప్రతి బింబిస్తాయని, వాటిని బావితరాలకు అందించటం కోసమే ప్రతి సంవత్సరం సెరినిటి పాఠశాలలో ముగ్గుల పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం ఆదాబ్ హైదరాబాద్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అత్యంత కోలాహలంగా, ఆనందోత్సాహాలతో తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News