ఈ ఏడాదికి గాను నోబెల్ శాంతి బహుమతి ప్రదానోత్సవం ఈ రోజు ఓస్లో(నార్వే రాజధాని)లో(Oslo in norway) నిర్వహిస్తున్నారు. అయితే.. అవార్డ్ విన్నర్ అయిన మరియా కొరీనా మచాడో(Maria Corina Machado) ఈ కార్యక్రమానికి హాజరుకావట్లేదు. ఆమె ప్రస్తుతం అజ్ఞాతంలో ఉండటమే దీనికి కారణం. వెనెజువెలా (Venezuela) దేశంలో ప్రతిపక్ష నేత (Opposition Leader) అయిన మరియా.. ఏడాది కాలంగా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నారు.
ప్రజాస్వామ్య సాధన కోసం పోరాడే క్రమంలో ఆమె ఎన్నో బెదిరింపులకు గురయ్యారు. ఇప్పుడు గనక నోబెల్ ప్రైజ్ కోసం వెనెజువెలాను వీడి వెళితే పరారీలో ఉన్న క్రిమినల్(Criminal)గా ప్రకటించనున్నట్లు ఆ దేశ అటార్నీ జనరల్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరియా నార్వే వెళ్లట్లేదు. ఆమె తరఫున కుటుంబ సభ్యులు హాజరవుతారు. నోబెల్ పురస్కారాన్ని మరియా కుమార్తె స్వీకరిస్తారు. ఈ విషయాన్ని నోబెల్ ఇన్‌స్టిట్యూట్ ప్రకటించింది.
