Wednesday, March 25, 2026
HomeతెలంగాణAdvisory | తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు..!

Advisory | తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు..!

  • రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్‌కు ఎలాంటి కొరత లేదు…
  • కావలసినంత స్టాక్ ఉంది…
  • భయాందోళనలతో బంకులవద్దకు పరిగెత్తడం చేయొద్దు…!
  • తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ముఖ్య ప్రకటన..!

ఇంధన కొరత లేదని, జనాలు పానిక్ అవ్వొద్దని అవసరం లేకపోయినా ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం స్టాక్ పెట్టుకోవాలని ఆలోచన చేయవద్దని.. ఇళ్లలో ఆయిల్ స్టాక్ పెట్టుకోవడం ప్రమాదకరమని తెలంగాణ పెట్రోలియ డీలర్స్ అసోసియేషన్ ఓ ప్రకటన ద్వాs క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి అమరేందర్ రెడ్డి పేరిట ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ఇంధన కొరత లేదని, జనాలు పానిక్ అవ్వొద్దని స్పష్టం చేశారు.

ఇంధన కొరత గురించి తప్పుడు, తప్పుదోవ పట్టించే వార్తలు ప్రచారం కావడం వల్ల చాలా మంది పెట్రోల్ బంకులకు పరుగులు తీసి అనవసరంగా తమ ట్యాంకులను నింపుకుంటున్న విషయం మా దృష్టికి వచ్చిందని నోట్‌లో పేర్కొన్నారు. ఈ భయాందోళన కొనుగోళ్ల కారణంగా అమ్మకాలు సాధారణ స్థాయిల కంటే దాదాపు 2.5 నుంచి 3 రెట్లు అసాధారణంగా పెరిగాయన్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న అనేక రిటైల్ అవుట్‌లెట్లలో స్టాక్ తాత్కాలికంగా అయిపోయిందని పేర్కొన్నారు.

- Advertisement -

ఇంధనం కొరత లేదని, హెచ్‌పీసీఎల్,ఐఓసీఎల్,బీపీసీఎల్ వద్ద తగినంత స్టాక్ అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. ఇంధన సరఫరా సాధారణంగానే కొనసాగుతోందన్నారు. అనంతరం కొందరికి వార్నింగ్ ఇచ్చారు. పెట్రోల్ లేదా డీజిల్ను డబ్బాలలో నిల్వ కోసం తీసుకువెళ్లడం PజుSO నిబంధనలకు విరుద్ధమని.. తీవ్రమైన భద్రతా ప్రమాదాన్ని కలిగిస్తుందని స్పష్టం చేశారు. ఇంధనాన్ని సరిగ్గా నిల్వ చేయకపోవడం అగ్ని ప్రమాదాలతో సహా ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చని..

ఇది ఇంధనాన్ని నిల్వ చేయడానికి సురక్షితమైన లేదా ఆమోదించబడిన పద్ధతి కాదన్నారు. ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేశారు. భయాందోళనలకు గురికాకుండా ఇంధనాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. నకిలీ వార్తలను నమ్మవద్దు లేదా ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News