Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeజాతీయంమావోయిస్టులతో చర్చలు అవసరంలేదు: అమిత్‌షా

మావోయిస్టులతో చర్చలు అవసరంలేదు: అమిత్‌షా

కేంద్ర ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని మావోయిస్టులు ఇటీవల పలుమార్లు కోరగా దానిపై హోం మంత్రి అమిత్‌షా స్పందించారు. చర్చల అవసరమే లేదని తేల్చిచెప్పారు. మావోయిస్టులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. మావోయిస్టులు అలా చేస్తే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, కేంద్రం ప్రకటించిన హామీలన్నీ అమలయ్యేలా చూస్తామని చెప్పారు. అవసరమైతే అంతకన్నా ఎక్కువగా సాయం చేసేందుకు సైతం ప్రయత్నిస్తామని అమిత్‌షా పేర్కొన్నారు. వర్షాకాలం‌లోనూ మావోయిస్టులను విశ్రాంతి తీసుకోనీయబోమని, ఆపరేషన్ కగార్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయ్‌పూర్ అటల్ నగర్‌లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీ, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News