Thursday, March 5, 2026
Homeఎన్‌.ఆర్‌.ఐNRI | ఎన్నారైల విషయంలో ఇప్పటికీ మార్పులేదు..

NRI | ఎన్నారైల విషయంలో ఇప్పటికీ మార్పులేదు..

  • 2026 బడ్జెట్ లో వారికి పాత పద్దతే..

ఆర్థికాభివృద్ధితో విశ్వగురువుగా వెలుగుతున్న భారత్‌లో ప్రవాసీయులు అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తున్నారు. భరతమాత ముద్దు బిడ్డలు అయినా ప్రతిసారీ బడ్జెట్ వడ్డింపులలో మాత్రం ప్రవాసీయుల పట్ల భారతదేశం ఇంకా గతించిన లైసెన్స్ రాజ్ వైఖరిని ప్రదర్శిస్తోంది. వాస్తవానికి ప్రతి బడ్జెటులో ప్రవాసీయులకు.. ప్రత్యేకించి గల్ఫ్ దేశాలలో నివసించే ప్రవాసీయులకు చెప్పుకోదగ్గ ప్రయోజనం ఏమీ లేదు. బడ్జెట్ కేటాయింపులను అర్థం చేసుకోవడం ప్రవాసీయులకు ఒక మిథ్యగా ఉంది.

దైనందిన ప్రవాసీయుల జీవితాలతో సంబంధం లేని విషయాలను పరస్పరం సామాజిక మాధ్యమాలలో పంచుకోవడం మినహా దానిపై విశ్లేషణ చేసే అవగాహన కొరవడింది. గల్ఫ్ దేశాలలో ఉండే సామాన్య ప్రవాసీ లోకానికి బడ్జెట్‌లో పర్సనల్ బ్యాగేజీ అనేది ముఖ్యం. కానీ దాని గురించి ఆశించిన విధంగా చర్చ జరగడం లేదు. ప్రవాసీయులు సంవత్సరం తర్వాత తాము స్వదేశానికి వెళ్తున్నప్పుడు తమ వెంట తీసుకెళ్లే వస్తువుల పై సుంకాల పరిధి, పరిమితి గురించి తెలుసుకోవాలి.

- Advertisement -

ఈ రకంగా తీసుకెళ్లే వస్తువులు పర్సనల్ బ్యాగేజీ పరిధిలోకి వస్తాయి. ఒక దశాబ్దకాలం తర్వాత దీన్ని సవరించారు. 2016లో రూపొందించిన నిబంధనల ప్రకారం 50 వేల రూపాయాలుగా ఉన్న ఈ పరిమితిని 2026లో 75 వేల రూపాయాలకు పెంచారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News