తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ(Congress Party)ని ప్రజలు రోజురోజుకూ చీత్కరించుకుంటున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే(Balkonda MLA) వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prashanth Reddy) అన్నారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాలనను ప్రజలు పూర్తిగా తిరస్కరించారని చెప్పారు. ఎన్నికల హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని, కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని తెలిపారు. ఇటీవల ముగిసిన సర్పంచ్ ఎన్నికలే కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో సోమవారం నిర్వహించిన జిల్లా అర్బన్ BRS పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం(BRS Party Key Workers Meeting)లో వేముల ప్రశాంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎంపీ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వి.జి.గౌడ్, మాజీ మేయర్ నీతు కిరణ్, సిర్పరాజ్, సూజిత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
ప్రజలు ముమ్మాటికీ కేసీఆర్(KCR) వైపే ఉన్నారు. నిజామాబాద్ అర్బన్‌లో 30కి పైగా కార్పొరేటర్ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. గడప గడపకు వెళ్లి గత 10 ఏండ్లలో చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు చెప్పాలి. ప్రజల్లో తిరిగితే వాళ్లు మనల్ని గుండెలకు హత్తుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. రూ.2500 చేయూత పెన్షన్ ఇప్పటికీ పుట్టనే లేదు. రూ.2000 పెన్షన్‌ను రూ.4000 చేస్తామని చెప్పి చేయలేదు.
ఉచిత గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్, 2 లక్షల ఉద్యోగాలు, తులం బంగారం, విద్యా భరోసా కార్డు వంటి హామీలన్నీ గాల్లో కలిసిపోయాయి. కాంగ్రెస్ పాలనా వైఫల్యాల కారణంగా ఆ పార్టీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. బీజేపీ పని అయిపోయింది. ఆ పార్టీ మాటలకే పరిమితమైంది. చెప్పుకునేందుకు బీజేపీకి ఏమీ మిగల్లేదు. మొన్నటి ఎమ్మెల్యే ఎన్నికల్లో బీజేపీకి లీడ్ ఇచ్చిన బాల్కొండ గ్రామంలో కూడా ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది.
బీజేపీ మూడో స్థానానికి పడిపోయింది. భీంగల్ మునిసిపాలిటీలో చేసిన అభివృద్ధి పనులే సాక్ష్యంగా నిలిచి, ప్రజలు 12కి 12 కౌన్సిలర్ స్థానాలను బీఆర్‌ఎస్‌కు కట్టబెట్టారు. నిజామాబాద్ అర్బన్‌లో మనం గట్టిగా పని చేస్తే 30కి పైగా కార్పొరేటర్ స్థానాలను గెలుచుకునే పూర్తి అవకాశం ఉంది. ప్రజలు ముమ్మాటికీ కేసీఆర్ వైపే ఉన్నాు. మనం గతంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు సరిగ్గా చెప్పగలిగితే విజయం ఖాయం.
పార్టీలో సీనియర్ కార్యకర్తలు ఇప్పటికీ ఉన్నారు. నిబద్ధతతో పనిచేసే ప్రతి డివిజన్‌కు ఇద్దరు ముగ్గురు నాయకులు చాలు. ఎన్నికలు గెలవొవచ్చు. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారు. గణేష్ గుప్తా అర్బన్ ప్రజల్లో ఉన్నారు. గత పదేళ్లలో గణేష్ గుప్తా నిజామాబాద్ అర్బన్ అభివృద్ధికి అనేక పనులు చేశారు. ఆ సంఘం, ఈ సంఘం అని చూడకుండా ప్రతి వర్గానికి సమానంగా నిధులు కేటాయించారు. ఒకప్పటి నిజామాబాద్‌తో పోలిస్తే ఇప్పటి నిజామాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది.
అది కేసీఆర్ నాయకత్వం, గణేష్ గుప్తా కృషి వల్లే సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీలకు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. మనం మాత్రం గడప గడపకు వెళ్లి గత 10 ఏండ్లలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలి.

