నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) ఇవాళ కేంద్ర విద్యా శాఖ మంత్రి(Union Minister for Education) ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan)ని పార్లమెంటలో కలిశారు. సర్వీసులో ఉన్న టీచర్ల (Inservice Teachers)కు కూడా TETలో ఉత్తీర్ణత తప్పనిసరి అంటూ ఇటీవల సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పుకు సంబంధించి వినతిపత్రం (Representation) సమర్పించారు. ఈ నిర్ణయం వల్ల నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని దాదాపు 3 వేల మంది ఉపాధ్యాయులపై ప్రభావితం పడుతుందని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిశీలించి, దీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడటానికి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రిని అభ్యర్థించారు.
- Advertisement -
