- నిర్మల్ ఎస్పీ
ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. సోమవారం ఫిర్యాదులను స్వీకరించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. వినతులు, ఫిర్యాదులు స్వీకరించి, అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం చేయాలన్నారు.


- Advertisement -
