Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeజాతీయందీపావళికి జీఎస్టీ సంస్కరణల బహుమతి

దీపావళికి జీఎస్టీ సంస్కరణల బహుమతి

ఎర్రకోట వేదికగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ

దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుభవార్త చెబుతూ, ఈసారి దీపావళి రెండింతల ఆనందాన్ని తెచ్చిపెట్టబోతుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఎర్రకోట వేదికగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, వస్తు-సేవల పన్ను (GST) విధానంలో కొత్త తరం సంస్కరణలు చేపట్టబోతున్నట్లు వెల్లడించారు.

సామాన్యులకు పన్ను ఉపశమనం
రాష్ట్రాలతో చర్చించి జీఎస్టీలో కీలక మార్పులు, చేర్పులు చేపట్టి, సామాన్యులపై పన్ను భారాన్ని గణనీయంగా తగ్గించబోతున్నామని ప్రధాని తెలిపారు. ఈ సంస్కరణల వలన చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు, ఎంఎస్‌ఎంఈలు, మరియు సాధారణ వినియోగదారులు లాభపడతారని చెప్పారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గి ప్రతి కుటుంబానికి ఉపశమనం లభిస్తుందని వివరించారు.

స్లాబుల మార్పు, సులభతర విధానం
వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు జీఎస్టీ స్లాబులను మారుస్తున్నామని, దీపావళి నాటికి సరళీకృత జీఎస్టీ విధానాన్ని ప్రజలు చూడబోతున్నారని మోదీ ప్రకటించారు. ఇందుకోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసి సంస్కరణల ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు చెప్పారు.

ఆర్థిక వ్యవస్థ బలపరచడమే లక్ష్యం
జీఎస్టీ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలపరచడమే కాకుండా, వినియోగాన్ని పెంచి వ్యాపార వృద్ధికి దోహదం చేస్తాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. “ఈ సంస్కరణలతో దీపావళి ప్రజలకు నిజమైన పండుగ కానుంది” అని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News