2016 నాటి పాత నిబంధనలు రద్దు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణలోని జర్నలిస్టుల(Telangana Journalists)కు ఇచ్చే మీడియా అక్రెడిటేషన్ కార్డుల(Media Accreditation Cards) విషయంలో రాష్ట్ర ప్రభుత్వం(State Government) కీలక నిర్ణయం తీసుకుంది. 2016 నాటి పాత నిబంధనలను రద్దు(Old Rules Cancel) చేసింది. వాటి స్థానంలో ‘తెలంగాణ మీడియా అక్రెడిటేషన్ రూల్స్-2025′(New Rules)ను ఖరారు చేసింది. ఈ మేరకు జీవో ఎం.ఎస్.నంబర్ 252ను జారీ చేసింది.
- Advertisement -
కొత్త నిబంధనల్లోని ముఖ్యాంశాలు
- అక్రెడిటేషన్ కమిటీల కాల పరిమితి: రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అక్రెడిటేషన్ కమిటీల పదవీ కాలం రెండేళ్లుగా నిర్ణయించారు. కొత్త కమిటీలు ఏర్పాటయ్యే వరకు పాతవే కొనసాగుతాయి.
- అక్రెడిటేషన్ కార్డు, మీడియా కార్డు: ప్రభుత్వ సమాచారాన్ని సేకరించేందుకు రిపోర్టర్లకు గుర్తింపుగా అక్రెడిటేషన్ కార్డు ఉపయోగపడుతుంది. డెస్క్ జర్నలిస్టులకు ఇచ్చేవి మీడియా కార్డులు. ఇవి కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం పొందేందుకు మాత్రమే పనికొస్తాయి.
- డిజిటల్ మీడియాకు తొలిసారి నిబంధనలు: డిజిటల్ న్యూస్ మీడియాకు అక్రెడిటేషన్ ఇవ్వాలంటే సదరు వెబ్‌సైట్‌కు గత ఆరు నెలల్లో నెలకు కనీసం 5 లక్షల మంది యూనిక్ విజిటర్స్ ఉండాలి. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ మీడియా కేటగిరీలో గరిష్టంగా 10 కార్డులు మాత్రమే ఇస్తారు.
- అర్హతా ప్రమాణాలు: న్యూస్ పేపర్ల కేటగిరీలో.. కనీసం 2 వేల ప్రతులు పంపిణీ అవుతున్న దినపత్రికలే అక్రెడిటేషన్ పొందేందుకు అర్హత పొందుతాయి. పీజీఆర్ఐ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో.. శాటిలైట్ ఛానళ్లు 50 శాతం వార్తల కంటెంట్‌ను కలిగి ఉండాలి. లోకల్ కేబుల్ ఛానళ్లు రోజుకు కనీసం 3 బులెటిన్లు టెలికాస్ట్ చేయాలి. జర్నలిస్టులు స్టేట్ లెవల్ అక్రెడిటేషన్ కోసం డిగ్రీ విద్యార్హత లేదా ఐదేళ్ల అనుభవం ఉండాలి. నియోజకవర్గ, మండల స్థాయి రిపోర్టర్లకు ఇంటర్ విద్యార్హత తప్పనిసరి.
- ఫ్రీలాన్స్ & వెటరన్ జర్నలిస్టులు: 15 ఏళ్ల అనుభవం ఉన్న ఫ్రీలాన్సర్లు, 30 ఏళ్ల అనుభవంతోపాటు 58 ఏళ్లు నిండిన వెటరన్ జర్నలిస్టులు కూడా కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
- కమిటీల నిర్మాణం: రాష్ట్ర కమిటీకి చైర్మన్‌గా మీడియా అకాడమీ చైర్మన్, కో-చైర్మన్‌గా ఐ అండ్ పీఆర్ కమిషనర్ వ్యవహరిస్తారు. ఇందులో వివిధ జర్నలిస్ట్ యూనియన్ల ప్రతినిధులు, పీసీఐ సభ్యులు ఉంటారు. జిల్లా కమిటీకి చైర్మన్‌గా జిల్లా కలెక్టర్, మెంబర్ కన్వీనర్‌గా డీపీఆర్వో వ్యవహరిస్తారు.
- నిబంధనలు ఉల్లంఘిస్తే: అక్రెడిటేషన్ కార్డులను దుర్వినియోగం చేసినా, తప్పుడు సమాచారం ఇచ్చినా లేదా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా కార్డులను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. పోగొట్టుకున్న కార్డుల స్థానంలో డూప్లికేట్ కార్డు కోసం రూ.250 చెల్లించాలి. సంస్థలో అర్హులైన జర్నలిస్టులు మాత్రమే అక్రిడిటేషన్‌కు దరఖాస్తు చేయాలి. నిబంధనలు అతిక్రమించి ఇతరులకు ఇస్తే సమాచార శాఖ తీసుకునే చర్యలకు బాధ్యత వహించాలి.
- Advertisement -
