ఏడాదికొక మంచి సినిమా(Good Movie) వస్తుందని, అలాంటి చిత్రమే ‘ఓ అందాల రాక్షసి’ అని హీరో, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా షెరాజ్ మెహదీ(Sheraz Mehdi) అందరినీ ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ‘ఓ అందాల రాక్షసి’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో విహాన్షి హెగ్డే, కృతివర్మ హీరోయిన్లుగా నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ అనే బ్యానర్ మీద సురీందర్ కౌర్ నిర్మాతగా ‘ఓ అందాల రాక్షసి’ చిత్రం జనవరి 2న రాబోతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో షెరాజ్ మెహదీ మాట్లాడుతూ.. ఓ అందాల రాక్షసి మూవీని జనవరి 2న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాం. ఇందులో నేహా దేశ్ పాండే, అఖిల, గీతారెడ్డి, స్నేహా, ప్రియా దేశ్ పాల్, సుమన్(Suman), తమ్మారెడ్డి భరద్వాజ్(Tammareddy Bharadwaj) తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఇది అద్భుతమైన కంటెంట్‌తో రాబోతోన్న ఓ మంచి సినిమా. ఆడియెన్స్‌కి ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. మంచి సందేశాత్మక కథతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. ఇందులోని ట్విస్ట్‌లు అద్భుతంగా ఉంటాయి. అమ్మాయిలకు నచ్చే చిత్రం అవుతుంది అని అన్నారు.
కథ, మాటల రచయిత భాష్యశ్రీ మాట్లాడుతూ.. ఓ అందాల రాక్షసి సినిమాకు కథ, మాటలు రాశాను. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఓ మంచి ఫీల్‌తో బయటకు వస్తారు. నేటి తరం ఆడపిల్లలు ఎలా ఉండాలనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని చేశాం. మా హీరో షెరాజ్ అద్భుతంగా నటించారు. డైరెక్టర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, హీరోగా ఇందులో మ్యాజిక్ చేశారు. కృతి వర్మ హిందీలో చాలా ఫేమస్. విహాన్షి అద్భుతంగా నటించారు. ఈ చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుంది అని అన్నారు.
కృతివర్మ మాట్లాడుతూ.. ఓ అందాల రాక్షసి మూవీలో నాకు అవకాశం ఇచ్చిన షెరాజ్‌కి థ్యాంక్స్. దేవుడి ఆశీస్సులు, ప్రేక్షకుల సపోర్ట్‌తో మా చిత్రం పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను అని అన్నారు.
విహాన్షి హెగ్డే మాట్లాడుతూ.. అమ్మాయిల్ని మోసం చేస్తే.. ఆ అందం రాక్షసిగా మారుతుంది. అదే మా ఓ అందాల రాక్షసి. ఈ చిత్రం, కథ నాకు చాలా నచ్చింది. ఈ మూవీ ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన షెరాజ్‌కి, భాష్యశ్రీ, సురేందర్‌కి థాంక్స్ అని అన్నారు.
