ఒలింపిక్(Olympic) పతకాల విజేత, జావెలిన్ త్రో (Javelin Throw) అథ్లెట్ నీరజ్ చోప్రా(Neeraj Chopra)కి మరోసారి పదోన్నతి లభించింది. ప్రస్తుతం రక్షణ శాఖలో మేజర్(Major)గా ఉన్న ఆయనకు కేంద్ర ప్రభుత్వం తాజాగా లెఫ్టినెంట్ కల్నల్ (Lieutenant Colonel) హోదా ఇచ్చింది. ఈ హోదాను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ (Rajnath Singh) అక్టోబర్ 22న ప్రదానం చేశారు.

ముందుగా 2016లో సుబేదార్ (Subedar) హోదాలో ప్రవేశించిన నీరజ్ చోప్రా 2021లో మేజర్‌గా ప్రమోట్ అయ్యారు. అదే సంవత్సరం దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ వరించింది. 2022లో ‘పరమ విశిష్ట సేవా పతకం’ పొందారు. అదే ఏడాది పద్మశ్రీ (Padma Shri) అవార్డు సైతం స్వీకరించారు.

