Friday, October 3, 2025
ePaper
Homeతెలంగాణఎన్డీఏ అభ్యర్థి నామినేషన్ దాఖ‌లు

ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్ దాఖ‌లు

  • ఉపరాష్ట్రపతి అభ్య‌ర్థిగా సీపీ రాధాకృష్ణన్
  • వెంట‌వ‌చ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో బుధవారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఆయన వెంట ఉండటం ఎన్డీఏ కూటమి ఐక్యతను ప్రతిబింబించింది.

నామినేషన్ దాఖలు సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు–ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తదితర అగ్రనేతలు పాల్గొన్నారు. దీంతో ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రాధాన్యత మరింత పెరిగింది.

సెప్టెంబర్‌ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్‌ కాలేజీలో ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో రాధాకృష్ణన్‌ విజయం ఖాయమని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంఖ్యాబలం దృష్ట్యా ఆయన ఎన్నిక ఏకపక్షంగానే జరగనుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News