Tuesday, February 10, 2026
Homeనల్లగొండNational Voters Day | ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

National Voters Day | ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

మోత్కూరు, జనవరి 23(ఆదాబ్ హైదరాబాద్): యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌(Mothkur)లో శుక్రవారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఉన్నత పాఠశాలలో రెవెన్యూ శాఖ(Revenue Department) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు ఓటు హక్కు(Right to Vote)పై విద్యార్థులకు అవగాహన(Awareness To Students) కల్పించారు. వారితో ప్రతిజ్ఞ(Pledge) చేయించారు. ఓటు హక్కు ఉన్నవారు స్వేచ్చాయుత వాతావరణంలో ఓటేయాలని సూచించారు. తహశీల్దార్ పి.జ్యోతి, ఎంపీడీఓ బాలాజీ నాయక్, హెడ్ మాస్టర్ దేవినేని అరవింద రాయుడు, ఆర్ఐ జె.సుమన్, ఏఎస్ఓ కృష్ణ, జూనియర్ అసిస్టెంట్ హరిబాబు, జీపీఓలు, రికార్డు అసిస్టెంట్లు, టీచర్లు అంజయ్య, రాంప్రసాద్, జయశ్రీ , ఉప్పలయ్య, రామకృష్ణ, ప్రవీణ్, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్, శశికుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News