- వికసిత్ భారత్-2047 లక్ష్యంగా జారుతుతున్న కార్యక్రమం..
ఉస్మానియా యూనివర్సిటీ లోని ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్ (EMRC) ఆధ్వర్యంలో “ఉన్నత విద్య పునర్నిర్మాణం వికసిత్ భారత్-2047 దిశగా డిజిటల్ మార్గాలు”అనే అంశంపై రెండు రోజుల జాతీయ సెమినార్ గురువారం ప్రారంభమైంది. కన్సర్తిమ్ ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ (సీఈసీ) న్యూఢిల్లీ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
సెమినార్ ప్రారంభోత్సవానికి CEC డైరెక్టర్ ప్రొఫెసర్ పరిక్షిత్ సింగ్ మన్హాస్ అధ్యక్షత వహించగా, తెలంగాణ కౌన్సిల్ అఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీజీసీయి) చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిస్టా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం,ఈఎంఆర్సి డైరెక్టర్ పి.రఘుపతి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ,డిజిటల్ లెర్నింగ్,మల్టీమీడియా బోధన విధానాలు మరియు ఆన్‌లైన్ విద్యా వనరుల విస్తరణ ద్వారా 2047 నాటికి భారతదేశాన్ని జ్ఞాన ఆధారిత దేశంగా తీర్చిదిద్దడం సాధ్యమని తెలిపారు. ‘స్వయం ప్రభ ’ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పట్టణ–గ్రామీణ ప్రాంతాల మధ్య విద్యా అంతరాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు.
సీఈసీ ఇప్పటికే 11 ఆన్‌లైన్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను సిద్ధం చేసిందని,వాటిని త్వరలో విశ్వవిద్యాలయాల ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.రెండు రోజుల పాటు జరిగే ఈ సెమినార్‌లో ఏఐ, మోక్స్ మరియు మీడియా ఆధారిత బోధనపై చర్చలు జరగనున్నాయి.దేశవ్యాప్తంగా అధ్యాపకులు,పరిశోధకులు పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు.
